Hyderabad: వనస్థలిపురంలో అర్ధరాత్రి హత్య బావను కొట్టి చంపిన బామ్మర్ది!

Hyderabad: హైదరాబాద్‌ వనస్థలిపురం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల వద్ద అర్ధరాత్రి ఘోరం జరిగింది.

Update: 2026-05-20 10:01 GMT

Hyderabad: వనస్థలిపురంలో అర్ధరాత్రి హత్య బావను కొట్టి చంపిన బామ్మర్ది!

హైదరాబాద్: తాండూరు హాజిపూర్ గ్రామానికి చెందిన వెంకటేష్ 2015 సంవత్సరములో ప్రేమ వివాహం చేసుకున్న మృతుడు వెంకటేష్ గత కొంత కాలంగా SR నగర్ లో నివాసం ఉండేది. వీరికి ఒక కూతురు , ఒక కొడుకు ఇద్దరు సంతానం తరచుగా ఏ పని చేయకుండా ఎప్పుడు తాగుతూ భార్య స్వప్న ను కొట్టేవాడని,

భర్త ను వదిలి తల్లిదండ్రులు వద్ద నాలుగు సంవత్సరాల నుండి వనస్థలిపురం లోని డబుల్ బెడ్ రూం లో ఉండేదనీ మృతిని భార్య స్వప్న అని తెలిపిన పోలీసులు. గత నాలుగు సంవత్సరాల నుండి మన్నెగూడ లో ఒంటరిగా నివాసం ఉంటున్న మృతుడు వెంకటేష్.

నిన్న అర్థరాత్రి పుల్ గా తాగి వనస్థలిపురం లోని డబుల్ రూమ్ వద్దకు వచ్చి నా పిల్లలను చూపించాలని గొడవ కు దిగిన మృతుడు వెంకటేష్. అర్దరాత్రి పూట వద్దు అని రేపు ఉదయం రమ్మని చెప్పిన వినకుండా ఇద్దరి మధ్యన గొడవ జరిగిందని, ఆ గొడవలో

అతని భామర్ది దుబ్బల పాండు కు మృతుడు వెంకటేష్ కు వాగ్వాదం జరిగిందని , చేతులతో కొట్టడంతో ముక్కు పైన, చెపుల పైన బలంగా దెబ్బలు తలగడంతో సృహ కోల్పోయిన మృతుడు వెంకటేష్, మృతిని భార్య స్వప్న ,ఆమె తమ్ముడు పాండు, అతని స్నేహితుడు జగదీష్ ముగ్గురు కలసి

కలసి మృతదేహని మూడవ ఫ్లోర్ నుండి కిందికి దించారు అని, మృతిని వెంకటేష్ ను కొట్టడం లో పాండు, అతని స్నేహితుడు జగదీష్ ఇద్దరు కలిసే హత్య చేశారా అని , పోలీస్ దర్యాప్తు లో నిజానిజాలు వెలుగులోకి వస్తాయని, తెలుస్తాయి స్థానికులు పలు రకాలుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఘటన స్థలానికి కేసు నమోదు చేసుకొని , పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి, క్లూస్ టీమ్ తో కలసి వనస్థలిపురం పోలీసులు వివరాలు సేకరిస్తూ న్నారు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న వనస్థలిపురం పోలీసులు.. మృతిని భార్య స్వప్న, మృతుని బామ్మర్ది పాండు పోలీసుల ముందు లొంగిపోయారు.

Tags:    

Similar News