Dharur: ధారూర్ మండలంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన స్పీకర్
Dharur: ధారూర్ మండలం కుక్కిందలో ఆరోగ్య ఉప కేంద్రం, ఔసుపల్లిలో జీపీ భవనాన్ని ప్రారంభించిన శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్.
Dharur: ధారూర్ మండలంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన స్పీకర్
ధారూర్: ధారూర్ మండలం కుక్కింద గ్రామంలో రూ.25 లక్షలతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని (PHC) మరియు ఔసుపల్లి గ్రామంలో రూ.20 లక్షలతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు.
పాల్గొన్న స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, గ్రామస్తులు. ఈసందర్భంగా జరిగిన గ్రామ సభలలో స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు మాట్లాడుతూ.... ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అదిక ప్రాధాన్యత ఇస్తున్నది.
హాస్పిటల్ నిర్మాణానికి, ఆధునిక పరికరాల ఏర్పాటుకు భారీ ఎత్తున నిధులను మంజూరు చేస్తున్నది. డాక్టర్లు, నర్సింగ్ స్టాఫ్ పోస్ట్ లను భర్తీ చేస్తున్నది. పట్టణాలలో బస్తి దవాఖానాలు లాగా, గ్రామాలలో పల్లె దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆధునిక కాలంలో మానసిక ఒత్తిడి ద్వారా ప్రజలు పెద్ద పెద్ద జబ్బులకు గురవుతున్నారు. యాబై సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తి ఆరు నెలలకు ఒకసారి హెల్త్ చెకప్ చేయించుకోవాలి. తద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
పేదలు వైద్యం కోసం డబ్బులు ఖర్చు చేయలేరని రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి పెద్ద ఎత్తున నిధులను ఇస్తున్నది. తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ రంగాలకు భారీగా నిధులను మంజూరు చేస్తున్నది. రైతులకు రుణమాఫి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరంటు, సబ్సిడీ గ్యాస్ సిలెండర్, కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీ, మహళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు వంటి పథకాలు అమలవుతున్నాయి. మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో మహిళా సాధికార పథకాలను అమలు చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి సహకారంతో వికారాబాద్ నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు అవుతున్నాయి. రోడ్లు, భవనాల శాఖ ద్వారా 600 కోట్లు, పంచాయితీ రాజ్ శాఖ ద్వారా ఇప్పటికే 480 కోట్లు మంజూరు కాగా నూతనంగా మరో 53 కోట్లు నూతనంగా మంజూరు అయ్యాయి. గత ప్రభుత్వంలో పదేళ్ళు రోడ్లకు నిధులు రాలేదు. రోడ్లు అద్వానంగా తయారయ్యాయి. నేను వచ్చాక రోడ్లను బాగు చేయించాలనే శ్రద్దతో పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేయించాను. R&B, పంచాయితీ రాజ్ శాఖల ద్వారా మంజూరైన నిధులతో వచ్చే రెండేళ్లలో నియోజకవర్గంలోని అన్ని రోడ్లను బాగు చేయిస్తాను.
మన ప్రాంతానికి సాగునీరు అందించాలనే ఆశయంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రాణహిత చేవెళ్ల, పాలమూరు రంగారెడ్డి పథకాల ద్వారా ప్రయత్నాలు చేశాను. ప్రాణహిత-చేవెళ్ల పథకంలో సుమారు 1500 కోట్ల రూపాయల పనులు కూడా అయ్యాయి. అయితే గత ప్రభుత్వం పదేళ్ళు ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసింది, పనులు జరుగలేదు. తరువాత జూరాల నుండి నీళ్ళను తరలించే విదంగా సర్వేలు చేయించి జీఓ కూడా తీసుకువచ్చాను. ఈ పథకాన్ని కూడా గత ప్రభుత్వం పక్కన పెట్టి మన ప్రాంతానికి అన్యాయం చేసింది.
అయితే ప్రస్తుతం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా నీళ్ళు కొడంగల్ దగ్గరి వరకు వస్తున్నాయి, మాకు కూడా ఇప్పించాలని కోరగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సరే అని హామీ ఇచ్చారు. సాగు నీళ్ళు వస్తే మన ప్రాంత రైతుల కష్టాలు తీరుతాయి.
స్వర్గీయ మర్రి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిర్మించిన కోట్ పల్లి ప్రాజెక్టును తరువాత ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇప్పుడు నేను పూర్తి స్థాయిలో మరమ్మత్తుల కోసం తొంబై కోట్ల రూపాయలు మంజూరు చేయించాను, పనులు చురుకుగా జరుగుతున్నాయి. అదేవిధంగా చెరువుల ఆధునికీకరణ, నూతన చెక్ డ్యాం నిర్మాణానికి నిధులను మంజూరు చేయిస్తాను.
అనంతగిరిని రూ. 2,500 కోట్లతో పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం, ఈ ప్రాజెక్టు ద్వారా అయిదువేల నుండి పదివేల ఉద్యోగాల కల్పన జరుగుతుంది. స్థానికులకే ఉద్యోగాలు వస్తాయి.