Uppal: జనగణనలో నిర్లక్ష్యం వద్దు: గడువులోగా పూర్తి చేయాలని కమిషనర్ ఆదేశం!
Uppal: ఉప్పల్ జోన్‌లో జనగణన ఏర్పాట్లపై సమీక్ష! ఖచ్చితత్వంతో డేటా సేకరణ చేయాలని అధికారులను ఆదేశించిన జోనల్ కమిషనర్ రాధికా గుప్తా.
Uppal: జనగణనలో నిర్లక్ష్యం వద్దు: గడువులోగా పూర్తి చేయాలని కమిషనర్ ఆదేశం!
ఉప్పల్: జనగణన కార్యక్రమాన్ని అత్యంత పారదర్శకంగా, ఖచ్చితత్వంతో నిర్వహించి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఉప్పల్ జోన్ జోనల్ కమిషనర్ రాధికా గుప్తా అధికారులను ఆదేశించారు. మల్కాజిగిరి నగరపాలక సంస్థ ఉప్పల్ జోనల్ మీటింగ్ హాల్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో అన్ని సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లు, కోఆర్డినేటర్లు, సూపర్వైజర్లతో ఆమె జనగణన ఏర్పాట్లపై చర్చించారు. ఫీల్డ్ స్థాయిలో ఎలాంటి పొరపాట్లు చోటుచేసుకోకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. హౌస్ లిస్టింగ్, డేటా సేకరణ వంటి కీలక పనులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని, ప్రతి వివరాన్ని సమగ్రంగా నమోదు చేయాలని తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమన్వయంతో పనిచేస్తూ ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. జనగణన ప్రక్రియ దేశాభివృద్ధికి కీలకమని, అధికారులు విధులను నిబద్ధతతో నిర్వహించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జోనల్ కమిషనర్ రాధికా గుప్తా స్పష్టం చేశారు.