Hyderabad: ఎంజీఐటీ విద్యార్థిని బలవన్మరణం.. వలస కుటుంబంలో తీరని శోకం

Hyderabad: హైదరాబాద్‌ మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కీర్తి డీజిల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంది.

Update: 2026-05-02 16:11 GMT

Hyderabad: ఎంజీఐటీ విద్యార్థిని బలవన్మరణం.. వలస కుటుంబంలో తీరని శోకం

Hyderabad: డీజిల్ పోసుకొని బీటెక్ విద్యార్థి ఆత్మహత్య. హైదరాబాద్ కమిషనరేట్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంఘటన. డీజిల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్ కమిషనరేట్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బతుకుతెరువు కోసం నగరానికి వలసకు వచ్చిన బడంపేట్ లోని న్యూ మారుతి నగర్ లో గత రెండు సంవత్సరాల నుండి నివాసం ఉంటున్నారు. కుమార్తె కీర్తి(21) గండిపేట లోని ఎంజిఐటి కాలేజీలో బిటెక్ మూడో సంవత్సరం చదువుతుంది.

ఎప్పటి లాగానే ఈరోజు కాలేజీకి వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న డీజిల్ ను పోసుకొని ఆత్మహత్య చేసుకుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న మీర్పేట్ పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించి అన్న నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News