Nagaram: హర్ ఘర్ తిరంగా’ ర్యాలీ: 600 మంది విద్యార్థులతో భారీ ప్రదర్శన!

Nagaram: నాగారం డివిజన్‌లో సెరినిటీ పాఠశాల విద్యార్థులు, బీజేపీ నేతల ఆధ్వర్యంలో ‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీ ఘనంగా జరిగింది. 600 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

Update: 2026-08-14 17:48 GMT

Nagaram: హర్ ఘర్ తిరంగా’ ర్యాలీ: 600 మంది విద్యార్థులతో భారీ ప్రదర్శన!

నాగారం: ప్రజల్లో దేశభక్తి నిపెంపొందించటానికి, జాతీయ జెండా పై గౌరవాన్ని చాటడానికి భారత ప్రభుత్వం హార్ ఘర్ తిరంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్దుందని బిజెపి నాయకులు విక్రమ్ రెడ్డి తెలిపారు. ప్రతి పౌరుడు తమ ఇళ్ల పై జాతీయ జెండా ను ఎగుర వేయాలని ఏనుగు సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు. జాతీయ గేయం వందేమాతరం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా, ఈ ఉత్సవాలను జాతీయ గీతానికి అంకితం చేశారని కౌకుట్ల చంద్రారెడ్డి తెలిపారు.

నాగారం డివిజన్లో హార్ ఘర్ తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు నాగారం సెరినిటి పాఠశాల నుండి రాంపల్లి చౌరస్తా వరకు , మళ్ళీ రాంపల్లి చౌరస్తా నుండి నాగారం పురవీధుల లో నిర్వహించారు. సుమారు 600 మంది సెరినిటి పాఠశాల విద్యార్థులు, సెరినిటి పాఠశాల కరెస్పాండంట్ జంగిరెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. బాజపా నాయకులు బిజ్జా శ్రీనివాస్, సురేష్, నాగరాజు, రవీందర్ రెడ్డి, రాంపల్లి సురేష్, రాహుల్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News