Nutankal: చిన్నారి ముక్కులో చాక్‌పీస్.. ఊపిరిపోసిన 108!

Nutankal: నూతన్‌కల్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని ముక్కులో ఇరుక్కున్న చాక్‌పీస్. తక్షణమే స్పందించి ప్రాణాలు కాపాడిన 108 ఈఎంటీ యాదమ్మ, పైలట్ తిరుపతి.

Update: 2026-07-18 06:55 GMT

Nutankal: చిన్నారి ముక్కులో చాక్‌పీస్.. ఊపిరిపోసిన 108!

Nutankal: నూతన్‌కల్ గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ఆటల మధ్య చాక్ పీస్‌ను ముక్కులో పెట్టుకుంది. దీనిని గమనించిన ఉపాధ్యాయులు మాజీ ఎస్‌ఎంసీ చైర్మన్‌కు సమాచారం ఇవ్వగా, వెంటనే 108 అంబులెన్స్‌కు కాల్ చేశారు.

సంఘటనా స్థలానికి చేరుకున్న 108 ఈఎంటీ యాదమ్మ, పైలట్ తిరుపతి చాకచక్యంగా చిన్నారి ముక్కులో ఇరుక్కున్న చాక్ పీస్‌ను తొలగించారు. దీంతో చిన్నారి క్షేమంగా బయటపడగా, తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది 108 సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

Tags:    

Similar News