Amaravati: స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
Amaravati: స్థానిక సంస్థల ఎన్నికలకు కూటమి శ్రేణులు సిద్ధం కావాలని సీఎం చంద్రబాబు పిలుపు. సీట్ల సర్దుబాటుపై అనవసర చర్చలు వద్దని నేతలకు గట్టి హెచ్చరిక.
Amaravati: స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
Amaravati: పార్టీ ముఖ్యనేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్..
తాజా రాజకీయ పరిణామాలు.. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ యంత్రాంగానికి నిర్వహించే వర్క్ షాప్ పై చర్చ..
వచ్చే నెలలో ఒకటి లేదా రెండో వారంలో వర్క్ షాప్ నిర్వహించే అవకాశం..
స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో ప్రిపేర్ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశం..
స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరూ పని చేయాలని సీఎం సూచన..
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏయే పార్టీ ఎన్నెన్ని స్థానాల్లో పోటీ చేస్తుందోననే అంశాన్ని కూటమి పార్టీల అగ్ర నాయకత్వాలు చర్చించి నిర్ణయానికి వస్తాయని సీఎం వెల్లడి..
స్థానిక సంస్థల్లో ఎవరెన్ని స్థానాల్లో పోటీ చేస్తారనే దానిపై ఇప్పుడు చర్చలు అప్రస్తుతమన్న సీఎం చంద్రబాబు..
ఈ విషయాన్ని పార్టీ అధిష్టానాలు చూసుకుంటాయని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి...
అనవసర చర్చకు తావిచ్చేలా ఏ ఒక్కరూ వ్యవహరించవద్దని ముఖ్యమంత్రి ఆదేశం...
కూటమి పార్టీల మధ్య విబేధాలు సృష్టించేందుకు గొడ్డలి పార్టీ కాచుకుని కూర్చొందనే విషయాన్ని గమనించాలన్న సీఎం చంద్రబాబు...
స్థానిక సంస్థల ఎన్నికల్లో 100 శాతం గెలుపు సాధించే విధంగా పని చేయాలన్న సీఎం.