Chirala: చీరాలలో పోలీసుల ఫుట్‌మార్చ్‌ 50 ద్విచక్ర వాహనాలు తరలింపు!

Chirala: చీరాలలో పోలీసుల ఫుట్‌మార్చ్, ఆకస్మిక తనిఖీలు. సరైన ధ్రువపత్రాలు లేని 50 ద్విచక్ర వాహనాలు సీజ్ చేసిన రెండో పట్టణ పోలీసులు.

Update: 2026-08-25 04:12 GMT

Chirala: చీరాలలో పోలీసుల ఫుట్‌మార్చ్‌ 50 ద్విచక్ర వాహనాలు తరలింపు!

Chirala: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో చీరాల రెండో పట్టణ పోలీసుల నిఘా ముమ్మరమైంది. ఎస్పీ బి. ఉమామహేశ్వర్‌, డీఎస్పీ ఎం.డి. మొయిన్‌ ఆదేశాల మేరకు రెండో పట్టణ సీఐ శశికుమార్‌ ఆధ్వర్యంలో సోమవారం జాన్‌పేట, జయంతిపేట ప్రాంతాల్లో పోలీసులు ఫుట్‌మార్చ్‌ నిర్వహించారు.

సుమారు 20 మంది పోలీసు సిబ్బందితో ఆయా ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించిన పోలీసులు రౌడీషీటర్లు, అనుమానితుల ఇళ్ల వద్ద ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రౌడీషీటర్లు, సస్పెక్ట్‌లకు కౌన్సెలింగ్‌ నిర్వహించి ఎన్నికల సమయంలో ఎలాంటి గొడవలు, అవాంఛనీయ ఘటనలకు పాల్పడవద్దని సూచించారు.

తనిఖీల్లో సరైన ధ్రువపత్రాలు లేని 50 ద్విచక్ర వాహనాలను గుర్తించిన పోలీసులు వాటిని చీరాల రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు ఎవరూ పాల్పడవద్దని సీఐ శశికుమార్‌ హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ముందస్తు చర్యల్లో భాగంగానే ఫుట్‌మార్చ్‌, తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Similar News