Nuzvid: నూజివీడు చైర్మన్‌గా ఇళయరాజా, వైస్ చైర్మన్‌గా సత్యనారాయణ
Nuzvid: నూజివీడు మున్సిపల్ చైర్మన్‌గా ఇళయరాజా, వైస్ చైర్మన్‌గా సత్యనారాయణ ప్రమాణ స్వీకారం; రూ.88.46 కోట్ల పనులపై మంత్రి పార్థసారథి వివరాలు.
Nuzvid: నూజివీడు చైర్మన్‌గా ఇళయరాజా, వైస్ చైర్మన్‌గా సత్యనారాయణ
నూజివీడు: నూజివీడు పురపాలక సంఘం నూతన చైర్మన్‌గా బర్రె ఇళయరాజా,వైస్ చైర్మన్‌గా పగడాల సత్యనారాయణ,ఇతర కౌన్సిలర్లు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.
పార్టీలకతీతంగా పనిచేసి నూజివీడును ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని ఆయన పిలుపునిచ్చారు.పట్టణ అభివృద్ధికి రూ. 88.46 కోట్లతో చేపట్టిన పనుల్లో 80 శాతం పూర్తయ్యాయని, మరో రూ. 155 కోట్ల పనులకు ప్రతిపాదనలు పంపామని మంత్రి వెల్లడించారు.
అధికారులు,కౌన్సిలర్ల సమన్వయంతో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని నూతన చైర్మన్ ఇళయరాజా తెలిపారు.ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, మున్సిపల్ కమిషనర్ కొరపాటి పీరయ్య తదితరులు పాల్గొన్నారు.