Velerupadu: వేలేరుపాడు ఎంపీపీగా బడిస వెంకమ్మ ప్రమాణ స్వీకారం!
Velerupadu: ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం వేలేరుపాడు ఎంపీపీగా బడిస వెంకమ్మ, వైస్ ఎంపీపీగా ఊకె సరోజిని గురువారం మండల పరిషత్ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు.
Velerupadu: వేలేరుపాడు ఎంపీపీగా బడిస వెంకమ్మ ప్రమాణ స్వీకారం!
వేలేరుపాడు: మండలంలో నూతన మండల పరిషత్ పాలకవర్గం కొలువుదీరింది. గురువారం మండల పరిషత్ కార్యాలయ భవనంలో ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ప్రొసీడింగ్ ఆఫీసర్ పి.ఎన్.వి. శేఖర్ దొర అధ్యక్షతన, ఇన్‌చార్జి ఎంపీడీవో సీహెచ్. శ్రీనివాస్ బాబు, ఎమ్మార్వో ఎన్. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
మండలంలోని మొత్తం ఏడుగురు ఎంపీటీసీ సభ్యులకు గాను నలుగురు మాత్రమే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా తాటుకూరుగొమ్మ పంచాయతీకి చెందిన వైసీపీ ఎంపీటీసీ సభ్యురాలు బడిస వెంకమ్మ వేలేరుపాడు ఎంపీపీగా ప్రమాణ స్వీకారం చేశారు.
అలాగే నార్లవరం పంచాయతీకి చెందిన ఎంపీటీసీ సభ్యురాలు ఊకె సరోజిని వైస్ ఎంపీపీగా బాధ్యతలు స్వీకరించారు. అదేవిధంగా ఎంపీటీసీ సభ్యులుగా సోడే సురేష్, కట్టే ఉదయ్ ప్రమాణ స్వీకారం చేశారు.
కాగా, మండల పరిషత్ పాలకవర్గంలో ఎంపీపీ, వైస్ ఎంపీపీ పదవులు చేపట్టిన ఇద్దరు మహిళా ప్రజాప్రతినిధులు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.