Eluru: ఏలూరు జిల్లాలో ప్రశాంతంగా రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు!
Eluru: ఏలూరు జిల్లాలోని 8 మండలాల్లో 160 సర్పంచ్, 1,219 వార్డు స్థానాలకు రెండవ విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు.
Eluru: ఏలూరు జిల్లాలో ప్రశాంతంగా రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు!
Eluru: ఏలూరు జిల్లాలో రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు.ఆదివారం భీమడోలు మండలం గుండుగొలను సచివాలయంలోని పోలింగ్ సరళిని, ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఆమె పరిశీలించారు.
జిల్లాలోని 8 మండలాల పరిధిలో 160 సర్పంచ్, 1,219 వార్డు సభ్యుల స్థానాలకు ఈ ఎన్నికలు నిర్వహించారు. పటిష్ట బందోబస్తు, వెబ్ కాస్టింగ్ పర్యవేక్షణ మధ్య ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ సాగిందని కలెక్టర్ పేర్కొన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రారంభించి, వెంటనే ఫలితాలు వెల్లడిస్తామని ఆమె స్పష్టం చేశారు.