Kukunoor: హమాలీ కార్మికుల కూలి రేట్లు వెంటనే పెంచాలి: సీఐటీయూ డిమాండ్!

Kukunoor: ఏలూరు జిల్లా కుక్కునూరులో హమాలీ కార్మికుల కూలి రేట్లను పెంచి, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి సాయికిరణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Update: 2026-07-18 10:39 GMT

Kukunoor: హమాలీ కార్మికుల కూలి రేట్లు వెంటనే పెంచాలి: సీఐటీయూ డిమాండ్!

కుకునూర్: ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలోని హమాలీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని సిఐటియు ఏలూరు జిల్లా కార్యదర్శి యర్నం సాయికిరణ్ డిమాండ్ చేశారు. శనివారం నాడు కుకునూరు స్థానిక సుందరయ్య భవనం ప్రజా సంఘాలు కార్యాలయంలో హమాలీ కార్మికుల సమావేశం మెస్త్రి కారం రమేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సాయికిరణ్ మాట్లాడుతూ, హమాలీ కార్మికుల కూలి రేట్లను వెంటనే పెంచి జీవన వ్యయానికి అనుగుణంగా వేతనాలు నిర్ణయించాలని కోరారు.

గతంలో హామీ ఇచ్చిన విధంగా హమాలీ కార్మికులందరికీ ఈఎస్ఐ పథకాన్ని వెంటనే అమలు చేయాలని, ప్రతి నెల వేతనాలను సకాలంలో చెల్లించాలని డిమాండ్ చేశారు. కుక్కునూరు ఎంఎల్‌ఎస్ పాయింట్‌లో పనిచేస్తున్న హమాలీ కార్మికులకు కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. కార్మికులు విశ్రాంతి తీసుకునేందుకు విశ్రాంతి భవనం ఏర్పాటు చేయాలని, తాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.

కొత్తగా చేరిన హమాలీలకు సీపీఎఫ్ నంబర్లు వెంటనే కేటాయించాలని, పెండింగ్‌లో ఉన్న పీఎఫ్ క్లెయిమ్‌లను పరిష్కరించాలని, హమాలీ కార్మికుల అన్ని సమస్యలను ప్రభుత్వం అత్యవసరంగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిఐటియు మండల నాయకులు పోచవరపు వెంకటేశ్వర్లు, హమాలీలు కడారి తిరుపతయ్య, తిరోజుల సురేష్, సాయిరాం, కిషోర్, లాడే వెంకటరావు, ముతేష్, వెంకటేష్, జోగరావు, చందు, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News