Sircilla: సిరిసిల్లలో దారుణం.. భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా పదిర గ్రామంలో దారుణం. భార్యను విచక్షణారహితంగా పొడిచి చంపిన భర్త. అడ్డు వచ్చిన అత్తపై కూడా దాడి, పరిస్థితి విషమం.

Update: 2026-09-03 06:23 GMT

Sircilla: సిరిసిల్లలో దారుణం.. భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త!

Sircilla: ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యను భర్త కత్తులతో విచక్షణారహితంగా పొడిచి హతమార్చిన ఘటన కలకలం రేపింది.

పదిర గ్రామానికి చెందిన పల్లపు జ్యోతి (రజిత) (27)పై ఆమె భర్త పల్లపు సురేష్ కత్తితో దాడి చేసినట్లు సమాచారం. గొంతు, కడుపు, చేతులపై తీవ్రంగా పొడవడంతో జ్యోతి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది.

దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన జ్యోతి అత్త గండికోట ఎల్లవ్వపై కూడా సురేష్ కత్తితో దాడి చేసినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన ఎల్లవ్వను సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌కు తరలించారు.

కుటుంబ కలహాలే హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News