Bheemili: భీమిలిలో ఘోర రోడ్డు ప్రమాదం: డ్రైవర్ మృతి!

Bheemili: విశాఖపట్నం జిల్లా భీమిలి పరిధిలో మైనింగ్ అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బీహార్‌కు చెందిన ట్రాలీ డ్రైవర్ దుర్మరణం చెందాడు.

Update: 2026-07-31 06:36 GMT

Bheemili: భీమిలిలో ఘోర రోడ్డు ప్రమాదం: డ్రైవర్ మృతి!

Bheemili: మైనింగ్ అధికారుల నిర్లక్ష్యం ఒకరి ప్రాణాన్ని తీసింది.భీమిలి పోలీసు స్టేషన్ పరిధిలోని సంగివలస శశి కాలేజ్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున 2:40 గంటలకు మైనింగ్/ఆర్.టి.ఓ అధికారులు ఇసుక లారీని తనిఖీల కోసం రోడ్డుపై నిలిపివేశారు.వెనుక నుంచి వేగంగా వచ్చిన ట్రాలీ ఆ లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో ట్రాలీ డ్రైవర్, బీహార్‌కు చెందిన శివకుమార్ (20) అక్కడికక్కడే మృతి చెందగా,మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. భీమిలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.​

మైనింగ్ అధికారుల తీరుపై లారీ యజమానులు,డ్రైవర్ల అసహనం.

రాత్రి వేళల్లో రోడ్ల మధ్యలో ఉన్నపళంగా లారీలను ఆపి ఇబ్బంది పెట్టడమే కాకుండా,పత్రాలన్నీ సక్రమంగా ఉన్నా వేధిస్తున్నారని మైనింగ్ అధికారులపై డ్రైవర్లు, యజమానులు తీవ్ర అసహనం,ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News