Chittoor: చిత్తూరు పాత బస్టాండ్ వద్ద వైఎస్సార్‌సీపీ రిలే నిరాహార దీక్షలు ప్రారంభం!

Chittoor: DSC–2025 నియామకాల్లో చోటుచేసుకున్న అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ .

Update: 2026-08-06 07:25 GMT

Chittoor: చిత్తూరు పాత బస్టాండ్ వద్ద వైఎస్సార్‌సీపీ రిలే నిరాహార దీక్షలు ప్రారంభం!

Chittoor: DSC–2025 అక్రమాలపై సీబీఐ విచారణకు డిమాండ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని వైసీపీ నేతల డిమాండ్ .

DSC–2025 నియామకాల్లో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలు, అవకతవకలపై సమగ్ర సీబీఐ విచారణ జరిపించాలని, రాజకీయ బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ చిత్తూరు పాత బస్టాండ్ ఎదుట రిలే నిరాహార దీక్షలుప్రారంభమయ్యాయి.వైయస్సార్‌సీపీ చిత్తూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎంసీ విజయానందరెడ్డి ఆధ్వర్యంలో గురువారం తొలి రోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు.ఈ కార్యక్రమంలో యువత, విద్యార్థులు, వైయస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు.

DSC–2025 నియామకాల్లో చోటుచేసుకున్నట్లు ఆరోపిస్తున్న అవకతవకలపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. అభ్యర్థులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, నియామక ప్రక్రియపై పారదర్శకత పాటించాలని కోరారు.ఈ సందర్భంగా ప్రభుత్వంపై తమ నిరసనను తెలియజేస్తూ నినాదాలు చేశారు. అక్రమాలు, అవకతవకలపై సీబీఐతో విచారణ జరిపించే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని నాయకులు పేర్కొన్నారు.

Tags:    

Similar News