Madanapalle: ఘనంగా యువ నాయకుడు రామాపురం శీను జన్మదిన వేడుకలు
Madanapalle: మదనపల్లెలో ఘనంగా యువ నాయకుడు రామాపురం శీను జన్మదిన వేడుకలు.
Madanapalle: ఘనంగా యువ నాయకుడు రామాపురం శీను జన్మదిన వేడుకలు
మదనపల్లె: యువ నాయకుడు రామాపురం శీను జన్మదిన వేడుకలను టీడీపీ రాష్ట్ర సీనియర్ నాయకులు కట్టా దొరస్వామి నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శీనుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా కట్టా దొరస్వామి నాయుడు మాట్లాడుతూ, రామాపురం శీను ప్రజా సేవలో చురుకుగా పాల్గొంటూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. సమాజ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తూ మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.
అనంతరం హరికృష్ణ రావు (ఎం.హెచ్.ఆర్), కట్టా లక్ష్మీనారాయణలు రామాపురం శీనుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో నిండి జీవితంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని రామాపురం శీనుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.