Chittoor: వెదురుకుప్పంలో బంగారు చైన్ కోసం మహిళ హత్య!
Chittoor: చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలంలో బంగారు చైన్ కోసం మహిళ హత్య కేసును చాకచక్యంగా చేదించిన సీఐ హనుమంతప్ప.
Chittoor: వెదురుకుప్పంలో బంగారు చైన్ కోసం మహిళ హత్య!
Chittoor: తేదీ 31-5- 2026 నాడు వెదురు కుప్పం పోలీస్ స్టేషన్ పరిధిలో గొడుగు చింత గ్రామ సమీపంలో వ్యవసాయ పొలాల్లో పార్వతమ్మ అనే మహిళా అనుమానాస్పద స్థితిలో మృతి చెంది పడి ఉండడం ఆమె కుమారులు గమనించి పార్వతమ్మ మృత దేహాన్ని ఇంటికి తీసుకెళ్లి పరిశీలించి ఆమె మరణం అనుమానపదంగా ఉండడం గమనించి వెదురు కుప్పం పోలీసులు కు ఫిర్యాదు చేయగా పోలీసు వారు సదరు ఫిర్యాదును అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
చిత్తూరు జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ తుషాల్ డ్యూటీ ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు సిఐ హనుమంతప్ప అన్ని కోణాలలో పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.
మహిళలు హత్య చేసి రెండు నెలలుగా తప్పించుకొని తిరుగుతున్న అదే గ్రామానికి చెందిన భాస్కర్ అనే వ్యక్తిని ఈ దినం అనగా 01.08.2026 సుమారు 11 గంటలకు వెదురుకుప్పం మండలం దేవలంపేట బస్ స్టాప్ వద్ద సిబ్బంది సహాయంతో చాకచక్యంగా అరెస్టు చేసి అతని వద్ద నుంచి పార్వతమ్మ మెడలో నుంచి దొంగలించిన బంగారు చైను రికవరీ చేసి ఈ దినం రిమాండ్ కు తరలించడం జరిగింది.
రికవరీ చేసిన బంగారు సుమారు 24 గ్రాములు, మొత్తం విలువ మూడు లక్షల రూపాయలు ఉంటుంది.
ఈ కేసును చేదించడంలో ప్రతిభ కనబరిచినటువంటి సిఐ హనుమంతప్ప,ఎస్సై వెదురుకుప్పం నవీన్ ను,క్రైమ్ కానిస్టేబుల్ లోకనాథం, గణేష్ మరియు సిబ్బందిని పై అధికారులు ప్రత్యేకంగా ప్రశంసించారు.
పై విషయంగా కార్వేటినగరం సర్కిల్ ఇన్స్పెక్టర్ హనుమంతప్ప మాట్లాడుతూ
నేరం చేసేవారు చట్టం నుంచి ఎప్పటికీ తప్పించుకోలేని ఎవరైనా ఇలాంటి నేరాలు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకొని వారిని చట్టం ముందు దోషులుగా నిలబెట్టి వారికి జీవిత ఖైదు లేదా ఉరిశిక్షగాని పడే వరకు పోలీసులు వదలరని తెలిపారు.