Renigunta: రైల్వే ఉద్యోగి ఆత్మహత్య కేసులో ట్విస్ట్.. మహిళ అరెస్ట్!
Renigunta: రేణిగుంటలో రైల్వే ఉద్యోగి కిల్లి రవి ఆత్మహత్య కేసులో తిరుపతికి చెందిన ఎస్. ఉషారాణిని అర్బన్ పోలీసులు సోమవారం ఉదయం అరెస్ట్ చేశారు.
Renigunta: రైల్వే ఉద్యోగి ఆత్మహత్య కేసులో ట్విస్ట్.. మహిళ అరెస్ట్!
Renigunta: రేణిగుంట పట్టణంలో ఇటీవల రైల్వే ఉద్యోగి కిల్లి రవి ఆత్మహత్యకు సంబంధించిన కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న ఎస్. ఉషారాణి (35), తిరుపతి మంగళం నివాసిని, సోమవారం ఉదయం రేణిగుంట మండలం కరకంబాడి బస్టాండ్ సమీపంలో రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ వై. శ్రీనివాసులు అదుపులోకి తీసుకుని చట్ట ప్రకారం అరెస్టు చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం, మృతుడు వద్ద లభ్యమైన సూసైడ్ నోట్, పోస్టుమార్టం నివేదిక, సేకరించిన ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలు మరియు ఇతర సమాచారాన్ని పరిశీలించిన అనంతరం నిందితురాలిపై చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
విచారణలో భాగంగా ఉషారాణి నుంచి కేసుకు సంబంధించిన వివరాలను సేకరించిన పోలీసులు, అనంతరం చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా ఆమెను న్యాయస్థానం ఎదుట హాజరుపరచినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోందని రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ తెలిపారు.