Ramasamudram: వైభవంగా శ్రీ గెవి తిమ్మరాయిని స్వామి శ్రావణ మూడో శనివారం వేడుకలు

Ramasamudram: అన్నమయ్య జిల్లా రామసముద్రం మోర్ కొండలోని గెవి తిమ్మరాయిని స్వామి ఆలయానికి శ్రావణ మూడో శనివారం భక్తులు పోటెత్తారు.

Update: 2026-08-29 15:06 GMT

Ramasamudram: వైభవంగా శ్రీ గెవి తిమ్మరాయిని స్వామి శ్రావణ మూడో శనివారం వేడుకలు

రామసముద్రం: అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం మోర్ కొండలో వెలసిన శ్రీ గెవి తిమ్మరాయిని స్వామి ఆలయంలో శ్రావణమాసం మూడో శనివారం పర్వదిన వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామివారి దర్శనం కోసం ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు.

దీంతో ఆలయ పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించగా, భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

పెద్ద సంఖ్యలో భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రామసముద్రం పోలీసులు ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు.

సీఐ, ఎస్సైల ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ట్రాఫిక్, భక్తుల రాకపోకలను పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించారు. శ్రావణ మూడో శనివారం స్వామివారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో మోర్ కొండలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.

Tags:    

Similar News