Punganur: పుంగనూరులో 'జగన్ 2.0' సూపర్ యాప్ ప్రారంభం
Punganur: పుంగనూరులో 'జగన్ 2.0' సూపర్ యాప్‌ను ప్రారంభించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కూటమి ప్రభుత్వంపై విమర్శలు. యాప్ ద్వారా వేధింపులపై ఫిర్యాదు చేయవచ్చని వెల్లడి.
Punganur: పుంగనూరులో 'జగన్ 2.0' సూపర్ యాప్ ప్రారంభం
పుంగనూరు: జగన్ 2.0 సూపర్ యాప్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పుంగనూరు లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో ఘనంగా యాప్ ప్రారంభోత్సవం. భారీగా తరలి వచ్చిన పార్టీ శ్రేణులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్స్. కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉండేలా మా అధ్యక్షులు వైఎస్ జగన్ నూతన యాప్ ను ప్రారంభించారు. సోషల్ మీడియా లోని వివిధ ప్లాట్ ఫార్మ్స్ లో ప్రశ్నించే గొంతులు అణిచి వేసే పరిస్థితి ఉంది.
ప్రశ్నల ద్వారా తప్పులు సరిదిద్దుకోవాల్సింది పోయి... కూటమి ప్రభుత్వం ఆ ప్రశ్నించే గొంతుల అణచివేతకు అడుగులు వేసింది. ఏకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంస్టా గ్రామ్, ఫేస్ బుక్ ఖాతాలను సైతం తొలగించేశారు. అనంతరం దీనిపై పోరాటం చేసి మళ్ళీ తిరిగి మన సోషల్ మీడియా అకౌంట్స్ వెనక్కు తెచ్చుకున్నాం. ప్రతిపక్ష పార్టీనే ఈ స్థాయిలో అణచివేయాలని ప్రభుత్వం చూస్తుంటే, ప్రశ్నించే సామాన్యుడు పరిస్థితి ఏంటి ?..
అందుకే వైఎస్ జగన్ గారు జగన్ 2.0 సూపర్ యాప్ ను ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు పార్టీ సమచారం నేరుగా కార్యకర్తకు చేరుతుంది. ఇందులోనే డిజిటల్ బుక్ ఆప్షన్ కూడా జత చేశారు. డిజిటల్ బుక్ ద్వారా అధికార పక్ష నాయకులు, పోలీసులు వేధింపులు పై కూడా ఫిర్యాదు చేయొచ్చు. పోలీస్ అధికారులు మనిషిని చంపేసి బూడిద కూడా లేకుండా ఆనవాళ్లు లేకుండా చేసే పరిస్థితి.
గుంటూరు లో మహిళ పై దాడి అత్యంత హేయం. ప్రతి కార్యకర్త సమస్యను ఇందులో పొందు పరచడం వల్ల... వైసీపీ అధికారంలోకి రాగానే అవినీతి అధికారులు పై, టీడీపీ కి అనుసంధానంగా పని చేస్తున్న వారిపై చర్యలు ఉంటాయి. కేవలం రెండు రోజుల్లో రెండు లక్షల మంది ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారు. ప్రజల అందరూ ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని ప్రభుత్వం చేసే అవినీతిని ఎండగట్టాలని కోరుతున్నాం..మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.