Madanapalle: చేనేతలకు ‘నేతన్న భరోసా’.. సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు

Madanapalle: చేనేత కార్మికుల కోసం ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘నేతన్న భరోసా’ ఆర్థిక సాయాన్ని రూ. 25 వేలకు పెంచింది.

Update: 2026-07-17 03:29 GMT

Madanapalle: చేనేతలకు ‘నేతన్న భరోసా’.. సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు

Madanapalle: చేనేత కార్మికుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అభినందనీయమని మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ భాష, జహా యువసేన నాయకుడు బాలమాలి శేఖర్ పేర్కొన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా 'నేతన్న భరోసా' పథకం కింద ప్రతి చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.25 వేల ఆర్థిక సహాయం అందించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించడం చేనేత కుటుంబాలకు ఎంతో ఊరటనిచ్చే నిర్ణయమని వారు తెలిపారు.

గతంలో అందించిన మొత్తానికి అదనంగా రూ.1,000 పెంచి రూ.25 వేలుగా ఆర్థిక సాయం అందించడం ద్వారా ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఎమ్మెల్యే షాజహాన్ భాష అన్నారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని వేలాది చేనేత కుటుంబాలకు ఆర్థిక భరోసా కలగడంతో పాటు వారి జీవనోపాధికి మరింత బలం చేకూరుతుందని పేర్కొన్నారు.

అదేవిధంగా, చేనేత రంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో చేతి మగ్గాలకు నెలకు 200 యూనిట్లు (పవర్‌లూమ్‌లకు) 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కూడా చేనేత కార్మికులకు ఎంతో మేలు చేస్తోందని తెలిపారు. ఈ చర్యలతో ఉత్పత్తి వ్యయం తగ్గి, చేనేత కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గుతుందని అన్నారు.

ఈ సందర్భంగా జహా యువసేన నాయకుడు బాలమాలి శేఖర్ మాట్లాడుతూ, చేనేత కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వరుసగా తీసుకుంటున్న సంక్షేమ నిర్ణయాలు చేనేత రంగానికి కొత్త ఊపునిస్తున్నాయని అన్నారు. 'నేతన్న భరోసా' పథకం, ఉచిత విద్యుత్ వంటి కార్యక్రమాలు చేనేత కుటుంబాల్లో నూతన ఆశలు నింపాయని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ భాష, జహా యువసేన నాయకుడు బాలమాలి శేఖర్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ఇదే విధంగా అండగా నిలవాలని ఆకాంక్షించారు.

Tags:    

Similar News