Naidupeta: అమరనాథ్ వెంటనే క్షమాపణ చెప్పాలి.. ఎమ్మెల్యే విజయశ్రీ
Naidupeta: ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనితపై వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా తిరుపతి జిల్లా నాయుడుపేటలో నిరసన.
Naidupeta: అమరనాథ్ వెంటనే క్షమాపణ చెప్పాలి.. ఎమ్మెల్యే విజయశ్రీ
Naidupeta: తిరుపతి జిల్లా నాయుడుపేటలోని గాంధీ పార్కు వద్ద సూళ్లూరుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ ఆదేశాల మేరకు నాయుడుపేట తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు 786 రఫీ సూచనలతో తెలుగుదేశం పార్టీ మహిళా నాయకుల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి అనిత పై వైసిపి నాయకుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా నాయుడుపేట పట్టణంలో గాంధీ మందిరం దగ్గర అమర్నాథ్ చిత్రపటం పై మహిళలు గుడ్లు పగలగొట్టి, అమర్నాథ్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
ఓ మహిళపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తెలుగుదేశం పార్టీ సహించేది లేదని ముఖ్యంగా వైసిపి నాయకులు దీనిని దృష్టిలో ఉంచుకొని మాట్లాడాలని ఓ మాజీ మంత్రి ఇలా మాట్లాడటం మహిళలను కించపరచడమే అవుతుందని కచ్చితంగా హోం మంత్రి అనితకు మాజీ మంత్రి అమర్నాథ్ క్షమాపణలు తెలియజేయాలని తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు తెలియజేశారు,
ఈ సందర్భంగా వారు తెలియజేస్తూ ఈ సందర్భంగా వైసీపీ నాయకులు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం దారుణం అని..మహిళలు ఈ వైసీపీ నాయకులకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి అని తెలిపారు...ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ టౌన్ మహిళా అధ్యక్షురాలు రేవతి , కన్నెమ్మ,సంపూర్ణమ్మ హైమావతి,సునీత, దగ్గోలు బబిత,కోకిల,విజయమ్మ,సరసమ్మ, లక్ష్మీ మరియు ఇతర మహిళా నాయకులు పాల్గొన్నారు.