Madanapalle: మదనపల్లె: 'స్వాస్థ్య వాకథాన్'ను ప్రారంభించిన ఏఎస్పీ!

Madanapalle: మదనపల్లె: సత్సంగ్ ఫౌండేషన్ 'స్వాస్థ్య వాకథాన్'ను ప్రారంభించిన ఏఎస్పీ వెంకటాద్రి. ఆరోగ్యకర జీవనానికి రోజువారీ నడక ఎంతో శ్రేయస్కరమని పిలుపు.

Update: 2026-07-30 09:08 GMT

Madanapalle: మదనపల్లె: 'స్వాస్థ్య వాకథాన్'ను ప్రారంభించిన ఏఎస్పీ!

మదనపల్లెలో ఉత్సాహంగా 'స్వాస్థ్య వాకథాన్'.. ఆరోగ్యకర జీవనానికి నడకే ఉత్తమ మార్గం: అదనపు ఎస్పీ ఎం. వెంకటాద్రి

మదనపల్లె: సత్సంగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం మదనపల్లెలో నిర్వహించిన "స్వాస్థ్య వాకథాన్" కార్యక్రమం ఉత్సాహభరితంగా జరిగింది. అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి, ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా అదనపు ఎస్పీ ఎం. వెంకటాద్రి ముఖ్య అతిథిగా హాజరై పచ్చజెండా ఊపి వాకథాన్‌ను ప్రారంభించారు. సత్సంగ్ ఆశ్రమం నుంచి ప్రారంభమైన ఈ వాకథాన్ ఎన్టీఆర్ సర్కిల్, అనీ బిసెంట్ సర్కిల్, బెంగళూరు రోడ్ మీదుగా తిరిగి ఆశ్రమానికి చేరుకుంది. ఈ సందర్భంగా విద్యార్థులు పర్యావరణ పరిరక్షణ, జల సంరక్షణ, ఆరోగ్యకర జీవనశైలిపై సందేశాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించారు. అనంతరం అదనపు ఎస్పీ ఎం. వెంకటాద్రి మాట్లాడుతూ, నేటి వేగవంతమైన జీవన విధానంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ప్రతిరోజూ నడకను జీవితంలో భాగం చేసుకుంటే శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు. యువత మత్తు పదార్థాలు, ఇతర వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రీడలు, సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సత్సంగ్ ఫౌండేషన్ ప్రతినిధులు పద్మభూషణ్ శ్రీ ఎం, సెక్రటరీ మహీందర్, వెంకీ నటరాజన్, మదనపల్లె డీఎస్పీ ఎం. బుచ్చిరాజు, సీఐలు రాజారెడ్డి, కళా వెంకటరమణ, గురునాథ్, ఆర్ఎస్ఐ శ్రీనివాస్, పోలీసు సిబ్బంది, విద్యార్థులు, సత్సంగ్ సభ్యులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:    

Similar News