Madanapalle: ఏపీ డీఎస్సీ 2025పై హైకోర్టు కీలక ఆదేశాలు!

Madanapalle: ఏపీ డీఎస్సీ 2025 నోటిఫికేషన్, వయోపరిమితి అంశాలపై దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టి కీలక ఆదేశాలు జారీ చేసింది. వివరాలు చూడండి.

Update: 2026-08-08 10:30 GMT

Madanapalle: ఏపీ డీఎస్సీ 2025పై హైకోర్టు కీలక ఆదేశాలు!

Madanapalle: మదనపల్లె, ఆగస్టు 8: డీఎస్సీ–2025 నియామక ప్రక్రియలో, ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా ఎంపికల్లో అక్రమాలు జరిగాయంటూ వస్తున్న ఆరోపణలపై సీబీఐతో సమగ్ర, నిష్పాక్షిక విచారణ జరిపించాలని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ రీజినల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు.

ఆరోపణలు ఎదురవుతున్న నేపథ్యంలో విచారణకు ఆదేశించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేసి విచారణను ఎదుర్కోవాలని అన్నారు. మదనపల్లె పట్టణంలోని అవెన్యూ రోడ్డులో తారకరామ సర్కిల్ వద్ద ఉన్న వైఎస్సార్‌సీపీ కార్యాలయం ఎదుట వైఎస్సార్‌సీపీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారం మూడో రోజుకు చేరుకున్నాయి.

ఈ దీక్షలకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అన్నమయ్య జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ డీఎస్సీ–2025 నియామక ప్రక్రియపై అభ్యర్థులు, నిరుద్యోగ యువతలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ ప్రభుత్వం వాటికి సమాధానం చెప్పకుండా తప్పించుకునే ధోరణి అవలంబిస్తోందని విమర్శించారు.

స్పోర్ట్స్ కోటా ఎంపికల్లో అర్హతలు, క్రీడా ధ్రువపత్రాల పరిశీలన, ఎంపిక విధానం తదితర అంశాలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిజంగా పారదర్శకంగా వ్యవహరిస్తే సీబీఐ విచారణకు ఎందుకు వెనుకాడుతోందని ప్రశ్నించారు. ఆరోపణల్లో వాస్తవం లేదని తేలితే విచారణ ద్వారానే ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవచ్చన్నారు.

డీఎస్సీ కార్యాలయంలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేసినట్లు పేర్కొంటున్న పురం నవీన్ టాపర్‌గా నిలిచారనే అంశం కూడా అభ్యర్థుల్లో అనుమానాలకు తావిచ్చిందని, ఈ అంశంతో పాటు మొత్తం ఎంపిక ప్రక్రియపై సమగ్ర విచారణ జరపాలని పెద్దిరెడ్డి కోరారు. విచారణలో ఎవరైనా తప్పు చేసినట్లు తేలితే వారి స్థాయి ఎంత ఉన్నా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అన్నమయ్య జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి మాట్లాడుతూ డీఎస్సీ నియామకాల్లో వస్తున్న ఆరోపణలను ప్రభుత్వం రాజకీయ విమర్శలుగా కొట్టిపారేయకుండా ప్రతి అంశాన్ని స్వతంత్ర దర్యాప్తు సంస్థతో పరిశీలించాలని కోరారు.

లక్షలాది మంది నిరుద్యోగ యువత భవిష్యత్తు, వారి కుటుంబాల ఆశలు ఉపాధ్యాయ నియామకాలతో ముడిపడి ఉన్నాయని, అందువల్ల నియామక ప్రక్రియపై ఎలాంటి అనుమానాలకు తావులేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. మదనపల్లె నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త ఎస్. నిస్సార్ అహ్మద్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం, ప్రస్తుతం ఉద్యోగ నియామక ప్రక్రియలపైనే అనుమానాలు తలెత్తేలా వ్యవహరించడం దారుణమన్నారు.

నిరుద్యోగ యువతలో ఉన్న ఆందోళనను ప్రభుత్వం అర్థం చేసుకుని వెంటనే డీఎస్సీ వ్యవహారంపై సమగ్ర విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఆరోపణలు నిజం కాదని ప్రభుత్వం భావిస్తే సీబీఐ విచారణకు ఆదేశించి వాస్తవాలను ప్రజల ముందుంచాలని, నిరుద్యోగ యువతకు న్యాయం జరిగే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

మాజీ ఎమ్మెల్యే డా. దేశాయ్ తిప్పారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగం కోసం సంవత్సరాలుగా కష్టపడుతున్న ప్రతి అభ్యర్థికి సమాన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. డీఎస్సీ నియామక ప్రక్రియపై అనుమానాలు తలెత్తిన నేపథ్యంలో స్పోర్ట్స్ కోటాతో పాటు మొత్తం నియామక ప్రక్రియను పారదర్శకంగా పునఃపరిశీలించాలని కోరారు. అభ్యర్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడకుండా, అర్హత ఆధారంగా నియామకాలు చేపట్టాలని అన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరచడంతో పాటు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, విద్యా కానుక, ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన వంటి పథకాలను సకాలంలో అందించాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు మాట్లాడుతూ డీఎస్సీ అభ్యర్థుల భవిష్యత్తుతో రాజకీయాలు చేయకుండా, నియామక ప్రక్రియపై వచ్చిన ఆరోపణలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని అన్నారు.

సీబీఐ విచారణలో ఎలాంటి అవకతవకలు జరగలేదని తేలితే ప్రభుత్వానికే స్పష్టత లభిస్తుందని, అందువల్ల విచారణకు వెనుకాడాల్సిన అవసరం లేదన్నారు. స్పోర్ట్స్ కోటా ఎంపికలపై సీబీఐ విచారణ జరిపించి, బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకునే వరకు ఆందోళనలను కొనసాగిస్తామని నాయకులు తెలిపారు.

మూడో రోజు రిలే నిరాహార దీక్షల్లో పార్టీ నాయకులు, యువజన, విద్యార్థి విభాగాల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొని “డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి.. మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి.. నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలి” అంటూ నినాదాలు చేశారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గం పరిశీలకురాలు ఎన్. అనీషా రెడ్డి, డి. ఉదయ్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ మనుజా రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ జింకా చలపతి, వి.ఎస్. రెడ్డి, సి.పి. రాఘవ రెడ్డి, ఎన్. మస్తాన్ ఖాన్, సిబ్యాల విజయభాస్కర్, ఎస్.కె. ఇర్ఫాన్, హేమంత్, పవన్ రాయల్, ఫిరోజ్, గుదిటి చరణ్, తాజ్ భాషా, నూర్ మొహమ్మద్ ఖాన్, తాహిర్, నాసీర్, నూరుల్లా, ప్రసాద్ బాబు, శ్రీనివాసులు, సుగుణా ఆంజనేయులు, ఈశ్వర్ నాయక్, శీలం రమేష్, వెలుగు చంద్ర, బొమ్మిశెట్టి మధు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:    

Similar News