Madanapalle: గ్రామకంఠం అసైన్డ్ ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్‌కు గ్రీన్ సిగ్నల్!
Madanapalle: మదనపల్లె సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ రామలక్ష్మీ పట్నాయక్ వార్షిక తనిఖీ చేశారు.
Madanapalle: గ్రామకంఠం అసైన్డ్ ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్‌కు గ్రీన్ సిగ్నల్!
మదనపల్లె: గ్రామకంఠం నివాసములకు పదేళ్లు అనుభవంలో ఉన్నన అసైన్డ్ పట్టా ఇండ్ల స్థలములు మరియు ఇండ్లకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను చేపడుతున్నట్లు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డిఐజి రామలక్ష్మీ పట్నాయక్ తెలిపారు. శనివారం ఆమె మదనపల్లె సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని వార్షిక తనిఖీ నిమిత్తము సందర్శించారు. రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ జీవో నెంబర్ 297 ద్వారా గ్రామ కంఠం భూములకు, జీవో నెంబర్ 306 ద్వారా పదేళ్ల అనుభవం ఉన్న అసైన్డ్ పట్టా ఉన్న ఇండ్ల స్థలములకు జి.వో లోని నియమ నిభందనల ప్రకారము మరియు ఇండ్లకు రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ సదవకాశాన్ని రైతులు, అసైన్డ్ పట్టా ఇండ్ల పట్టాలు, ఇండ్ల స్థలములు కలిగిన అర్హులు వినియోగించుకొని తమ అసైన్డ్ పట్టా స్థలాలు మరియు యిండ్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలియజేశారు. మదనపల్లె సబ్ రిజిస్త్రారు కార్యాలయంలో సేవలన్నీ పారదర్శకంగా జరుగుతున్నాయని, ఎలాంటి ఫిర్యాదులు అందలేదని ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు.
సబ్ రిజిస్ట్రార్ గురుస్వామి పనితీరు వల్ల రాష్ట్ర ఖజానాకు ఏడాదిలో రూ.85.65 కోట్లు జమ చేసేటట్లు లక్ష్యముగా ప్రతి పాదనలు సిద్దము చేసినారు. ప్రతినెల సరాసరిన రూ.7 కోట్ల రాబడి లక్ష్యముగా రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. వివాదాస్పద స్థలాలకు రిజిస్ట్రేషన్ లు చేయకుండా గురుస్వామి చాలా స్పష్టంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు.
నాసిక్ నుంచి స్టాంప్స్ రావాల్సి ఉందని, అవసరమైన మేర స్టాంప్స్ ను తెప్పించుకోవడానికి చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్ శాఖ నుంచి పారదర్శక సేవలు అందిస్తున్నామన్నారు.
స్లాట్ విధానము మరియు 1బి , అడంగల్ ఆటో మ్యుటేషణ్ విధానము ప్రజలకు ఎంతో సౌలభ్యముగా వున్నదని తెలిపినారు. ఓ.టి.పి.విధానము వలన ప్రజలకు పారదర్శికముగా , వేగముగా సేవలు అందిస్తున్నట్లు తెలిపినారు. ఈ సందర్భంగా స్టాంప్ వెండర్స్ డీఐజీ రామలక్ష్మి పట్నాయక్ ను కలిసి శాలువతో సత్కరించినారు. అదేవిధంగా సబ్ రిజిస్టర్ గురుస్వామిని సన్మానించారు.