ఇంతలా ఎగబడి మరీ కొంటున్నారేందయ్యా.. 30 రోజుల్లో 1.36 లక్షల సేల్స్‌తో దూకుడు..!
TVS Jupiter: భారత ద్విచక్ర వాహన మార్కెట్లో టీవీఎస్ మోటార్స్ హవా కొనసాగుతోంది.
ఇంతలా ఎగబడి మరీ కొంటున్నారేందయ్యా.. 30 రోజుల్లో 1.36 లక్షల సేల్స్‌తో దూకుడు..!
TVS Jupiter Sales: సామాన్యుడి బడ్జెట్ నుంచి ప్రీమియం ఫీచర్ల వరకు అన్నీ కలగలిసిన స్కూటర్ కావడంతో టీవీఎస్ జూపిటర్‌కు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. జూన్ నెలలో ఏకంగా 1,36,805 యూనిట్లను విక్రయించి టీవీఎస్ లైనప్‌లో నెంబర్ వన్ మోడల్‌గా నిలిచింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 26.69 శాతం వృద్ధి కావడం విశేషం. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 73,400 నుంచి మొదలై రూ. 86,900 వరకు ఉంటుంది. 113.3 సీసీ ఇంజిన్ కలిగిన ఈ స్కూటర్ 53.8 కిలోమీటర్ల అద్భుతమైన మైలేజీనిస్తుందని కంపెనీ చెబుతోంది. లీటర్ పెట్రోల్ పోస్తే ఎంచక్కా ఆఫీస్‌కి వెళ్లిరావచ్చని భావించే మధ్యతరగతి కుటుంబాలకు ఇది బెస్ట్ ఆప్షన్‌గా మారింది.
ఎలక్ట్రిక్ రేసులో ఐక్యూబ్ సంచలనం..
ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో టీవీఎస్ ఐక్యూబ్ అనూహ్యమైన వృద్ధిని నమోదు చేసింది. గత ఏడాది జూన్‌లో కేవలం 14,244 యూనిట్లు మాత్రమే అమ్ముడవగా, ఈసారి ఏకంగా 47,331 యూనిట్లకు సేల్స్ పెరిగాయి. అంటే ఏకంగా 232.29 శాతం వృద్ధి సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. పెట్రోల్ ధరల భారం, ఎలక్ట్రిక్ వాహనాల పట్ల పెరుగుతున్న అవగాహన ఐక్యూబ్ సేల్స్ పెరగడానికి ప్రధాన కారణం. పర్యావరణ స్పృహ ఉన్న యువత, తక్కువ ఖర్చుతో ప్రయాణించాలనుకునే ఉద్యోగులు ఈ ఈవీ స్కూటర్‌ను ఇష్టపడుతున్నారు.
కుర్రకారు ఫేవరెట్.. అపాచీ, ఎన్‌టార్క్..
స్పోర్ట్స్ బైక్ సెగ్మెంట్‌లో టీవీఎస్ అపాచీ తన స్థానాన్ని పదిలం చేసుకుంది. జూన్ నెలలో 55,382 యూనిట్లను విక్రయించి 33.82 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇక స్టైలిష్ లుక్‌తో యూత్‌ను ఎట్రాక్ట్ చేస్తున్న ఎన్‌టార్క్ స్కూటర్ సేల్స్ కూడా 65.46 శాతం పెరిగాయి. గత నెలలో 37,762 ఎన్‌టార్క్ స్కూటర్లు అమ్ముడయ్యాయి. మగవారిలో ముఖ్యంగా యువతలో ఈ రెండు మోడళ్లకు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని ఈ గణాంకాలు చెబుతున్నాయి.
పల్లెల్లో మోపెడ్ల హవా.. ఎక్స్‌ఎల్ 100..
ఇక గ్రామీణ ప్రాంతాల్లో, చిన్న వ్యాపారులకు ఆధారంగా మారిన టీవీఎస్ ఎక్స్‌ఎల్ 100 మోపెడ్ కూడా అదరగొట్టింది. జూన్ నెలలో 50,155 యూనిట్లు అమ్ముడై 50.39 శాతం వృద్ధి సాధించింది. ఓవరాల్‌గా చూసుకుంటే, జూన్ 2026లో టీవీఎస్ మోటార్స్ మొత్తం 4,11,014 ద్విచక్ర వాహనాలను విక్రయించింది. గత ఏడాది ఇదే నెలలో 2,81,012 వాహనాలు మాత్రమే అమ్ముడయ్యాయి. ఓవరాల్‌గా 46.26 శాతం వృద్ధిని నమోదు చేసి మార్కెట్లో తన సత్తా చాటింది.
మైలేజ్, ఫీచర్లు, సరసమైన ధర.. ఈ మూడింటి కలయికతో టీవీఎస్ వాహనాలు కస్టమర్లను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. రాబోయే పండుగ సీజన్‌లో ఈ అమ్మకాలు మరింతగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.