SBI: ఎస్‌బీఐ నుంచి వచ్చేసిన కొత్త స్కీమ్.. పెట్టుబడికి సరికొత్త మార్గం..!
SBI: ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ నిఫ్టీ మిడ్ క్యాప్ 150 మూమెంటమ్ 50 ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్ పేరుతో కొత్త NFO ను లాంచ్ చేసింది.
SBI: ఎస్‌బీఐ నుంచి వచ్చేసిన కొత్త స్కీమ్.. పెట్టుబడికి సరికొత్త మార్గం..!
SBI Mutual Fund: దేశంలోనే అతిపెద్ద అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్, మార్కెట్‌లో వేగంగా దూసుకెళ్తున్న మిడ్‌క్యాప్ స్టాక్స్‌ను లక్ష్యంగా చేసుకుని ఎస్‌బీఐ నిఫ్టీ మిడ్ క్యాప్ 150 మూమెంటమ్ 50 ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేసింది.
స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ మంచి రాబడులు సాధించాలని అనుకుంటున్నారా..? అయితే మీకో సరికొత్త అవకాశం తలుపు తడుతోంది. దేశంలోనే అత్యంత నమ్మకమైన, అతిపెద్ద అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ ఒక కొత్త స్కీమ్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. అదే ఎస్‌బీఐ నిఫ్టీ మిడ్ క్యాప్ 150 మూమెంటమ్ 50 ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్. మార్కెట్లో అత్యంత వేగంగా ఎదుగుతున్న టాప్ 50 మిడ్ క్యాప్ స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టేలా ఈ ఫండ్‌ను తీర్చిదిద్దారు.
ఈ కొత్త ఫండ్ ఆఫర్ పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉంటుంది. జులై 22న సబ్‌స్క్రిప్షన్ ప్రారంభమైంది. ఆగస్టు 04, 2026తో సబ్‌స్క్రిప్షన్ ముగుస్తుంది. కనీస పెట్టుబడిగా రూ. 5,000 నిర్ణయించారు. ఇన్వెస్టర్లు ఒకేసారి గుత్తగా గానీ, లేదా ప్రతి నెలా క్రమబద్ధమైన పద్ధతిలో సిప్ ద్వారా గానీ ఇన్వెస్ట్ చేయవచ్చు. యూనిట్ల అలాట్‌మెంట్ జరిగిన 15 రోజుల్లోపు విత్‌డ్రా చేస్తే 1 శాతం ఎగ్జిట్ లోడ్ వర్తిస్తుంది. అయితే, 15 రోజుల వ్యవధి దాటిన తర్వాత ఉపసంహరించుకుంటే ఎలాంటి ఎగ్జిట్ లోడ్ ఉండదు. ఇది మిడ్‌క్యాప్ ఫండ్ ఆధారిత స్కీమ్ కాబట్టి ఇందులో రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుందని ఎస్‌బీఐ ఏఎంసీ స్పష్టం చేసింది.
ఆగస్టు 04, 2026 లోపు ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ అధికారిక వెబ్‌సైట్, మొబైల్ యాప్ లేదా గుర్తింపు పొందిన థర్డ్-పార్టీ మ్యూచువల్ ఫండ్ యాప్‌ల ద్వారా సులభంగా ఆన్‌లైన్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. గడువు ముగిసిన తర్వాత యూనిట్లను కేటాయించి, క్రమంగా రెగ్యులర్ ట్రేడింగ్ కోసం ఓపెన్ మార్కెట్లోకి తీసుకొస్తారు.