Infosys: గుడ్ న్యూస్ చెప్పిన ఇన్ఫోసిస్‌..ఐటీ ఉద్యోగులకు పండగే

Infosys: భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ అమెరికా ప్రముఖ ఫుట్‌వేర్ సంస్థ క్రాక్స్‌తో పదేళ్ల ఒప్పందం కుదుర్చుకుంది.

Update: 2026-08-09 05:39 GMT

Infosys: గుడ్ న్యూస్ చెప్పిన ఇన్ఫోసిస్‌..ఐటీ ఉద్యోగులకు పండగే

Infosys Crocs Deal : భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఖాతాలో మరో భారీ గ్లోబల్ ప్రాజెక్ట్ చేరింది. అమెరికాకు చెందిన ప్రముఖ ఐకానిక్ ఫుట్‌వేర్ బ్రాండ్ క్రాక్స్‌తో ఏకంగా 10 ఏళ్ల పాటు వ్యూహాత్మక సాంకేతిక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మెగా డీల్ విలువ సుమారు రూ. 2,800 కోట్లు ఉంటుందని మార్కెట్ నిపుణుల అంచనా వేస్తున్నారు.

ఇన్ఫోసిస్ తన ఏఐ ఫస్ట్ ప్లాట్‌ఫామ్‌లు, ఆటోమేషన్ టెక్నాలజీతో క్రాక్స్ గ్లోబల్ ఐటీ వ్యవస్థను పూర్తిగా ఆధునికీకరిస్తుంది. క్రాక్స్ సంస్థలోని వివిధ వ్యాపార విభాగాల డేటాను ఒకే సిస్టమ్‌లోకి తీసుకువచ్చి, రియల్ టైమ్ డేటా ఆధారంగా వేగంగా వ్యాపార నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. ఐటీ నిర్వహణ ఖర్చులను గణనీయంగా తగ్గించడమే కాకుండా, క్రాక్స్ తన కస్టమర్లకు మెరుగైన డిజిటల్ అనుభవాన్ని అందించేందుకు ఈ ప్రాజెక్ట్ తోడ్పడుతుంది.

ఇన్ఫోసిస్ మొత్తం ఆదాయంలో రిటైల్ వాటా ఇప్పటికే 12.8 శాతంగా ఉండగా, ఈ డీల్‌తో ఆ సంస్థ రిటైల్ పోర్ట్‌ఫోలియో మరింత బలపడనుంది. ఇన్ఫోసిస్ ఆటోమేషన్ సామర్థ్యాలతో మా వ్యాపార కార్యకలాపాలను మరింత వేగవంతం చేస్తాం. భవిష్యత్తు వృద్ధికి అవసరమైన టెక్నాలజీ వ్యవస్థను సిద్ధం చేయడమే మా లక్ష్యమని ప్రతినిధి టామ్ బ్రిట్ తెలిపారు.

సాధారణంగా ఐటీ రంగంలో 100 మిలియన్ డాలర్లు దాటితేనే భారీ ప్రాజెక్ట్‌గా భావిస్తారు. అలాంటిది పదేళ్ల కాలపరిమితితో కుదిరిన ఈ ఒప్పందం, ప్రపంచ రిటైల్ డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ రంగంలో ఇన్ఫోసిస్ ఆధిపత్యాన్ని మరొకసారి నిరూపించింది.

Tags:    

Similar News