Gold Prices : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. ఈరోజు తులం ఎంతో తెలుసా..?

Gold Prices: గ్లోబల్ మార్కెట్ ప్రభావంతో దేశీయంగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.

Update: 2026-08-31 05:16 GMT

Gold Prices : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. ఈరోజు తులం ఎంతో తెలుసా..?

Gold Rate: గత కొన్ని వారాలుగా తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్న బంగారం, వెండి ధరలు కొత్త వారం ప్రారంభంలో కాస్త శాంతించాయి. ఆగస్ట్ నెలలో రికార్డు స్థాయి పరుగుతో పసిడి ప్రియులను కలవరపెట్టిన ధరలు, గత వారం చివర్లో భారీగా పతనమైన సంగతి తెలిసిందే. సోమవారం నాటి ట్రేడింగ్‌లో దేశీయ మార్కెట్‌లో గోల్డ్, సిల్వర్ రేట్లు స్థిరంగా కొనసాగుతుండగా, అంతర్జాతీయంగా స్వల్పంగా దిగొచ్చాయి.

యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచే అవకాశాలు ఉన్నాయని ఛైర్మన్ కెవిన్ వార్ష్ సంకేతాలు ఇవ్వడంతో గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ఆకర్షణ తగ్గింది. వారం కిందట ఔన్సుకు 4,650 డాలర్ల మార్కును దాటిన స్పాట్ గోల్డ్ ధర, ప్రస్తుతం 4,440 డాలర్ల స్థాయికి చేరుకుంది. సిల్వర్ రేటు ఔన్సుకు 66 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఫెడ్ నిర్ణయాలతో డాలర్, బాండ్ ఈల్డ్స్‌కు గిరాకీ పెరగడమే ఇందుకు ప్రధాన కారణం.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలను ఓసారి పరిశీలిస్తే..హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,45,050 వద్ద స్థిరంగా ఉండగా, 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ. 1,58,240 వద్ద కొనసాగుతోంది. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు వంటి నగరాల్లో కూడా 22 క్యారెట్ల రేటు రూ. 1,45,050 గాను, 24 క్యారెట్ల రేటు రూ. 1,58,240 గానూ నమోదైంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 1,45,200 కాగా, 24 క్యారెట్ల ధర రూ. 1,58,390 వద్ద ఉంది. ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా నగరాల్లో 22 క్యారెట్లు రూ. 1,45,050 వద్ద, 24 క్యారెట్లు రూ. 1,58,240 వద్ద ట్రేడవుతున్నాయి. ద్రవ్యోల్బణం, రూపాయి మార్పిడి విలువ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, కేంద్ర బ్యాంకుల నిర్ణయాల ఆధారంగా రానున్న రోజుల్లో పసిడి ధరలు మరింత మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags:    

Similar News