Gold Price Today : బంగారం కొనాలనుకునే వారికి పండగే.. భారీగా దిగివస్తున్న పసిడి, వెండి ధరలు

Gold Price Today : అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్, విజయవాడ సహా దేశంలోని ప్రధాన నగరాల్లో లేటెస్ట్ పసిడి రేట్ల పూర్తి వివరాలు ఇవే.

Update: 2026-06-20 01:51 GMT

Gold Price Today

Gold Price Today : ప్రస్తుత రోజుల్లో సామాన్యుడికి బంగారం కొనడం అనేది ఒక పెద్ద కలగా మారిపోయింది. అయితే రికార్డు స్థాయి గరిష్టాలను తాకిన బంగారం, వెండి ధరలు ప్రస్తుతం క్రమంగా దిగివస్తున్నాయి. అంతర్జాతీయంగా మార్కెట్లలో చోటుచేసుకున్న మార్పుల వల్ల దేశీయంగా కూడా బులియన్ మార్కెట్లో రేట్లు తగ్గుతున్నాయి. రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్త పరిణామాల ఆధారంగా పసిడి, వెండి ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. గ్లోబల్ మార్కెట్లో వచ్చిన కొన్ని కీలక మార్పులు ఈ ధరల తగ్గుదలకు కారణమయ్యాయి. ముఖ్యంగా అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన శాంతి ఒప్పందం, దానికి తోడు అంతర్జాతీయంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన హోర్ముజ్ జలసంధి వాణిజ్యం కోసం తిరిగి తెరుచుకోవడం వంటి పరిణామాలు మార్కెట్ సెంటిమెంట్‌ను మార్చేశాయి. దీనికి తోడుగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో బంగారం పై ఏకంగా రూ.3,600 వరకు భారీ తగ్గింపు నమోదైంది.

దేశీయంగా తాజా బంగారం, వెండి ధరల ట్రెండ్

శనివారం ఉదయం 6 గంటల వరకు ఉన్న అధికారిక సమాచారం ప్రకారం.. దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములపై కేవలం రూ.10 మేర స్వల్పంగా తగ్గి రూ.1,45,850 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. అదే సమయంలో ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల పసిడి రేటు కూడా 10 గ్రాములపై రూ.10 తగ్గి రూ.1,33,690గా నమోదైంది. మరోవైపు వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. కిలో వెండిపై రూ.100 మేర తగ్గి దేశీయంగా రూ.2,49,900 లుగా ట్రేడ్ అవుతోంది.

హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లో రేట్ల వివరాలు

తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ప్రాంతాల వారీగా స్థానిక పన్నుల కారణంగా ధరలలో స్వల్ప వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,850 గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,33,690 వద్ద ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.2,54,900 గా నమోదైంది. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ నగరాలైన విజయవాడ, విశాఖపట్నంలో కూడా 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,45,850 గా, 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,33,690 గా ఒకే రకమైన ధరలను కలిగి ఉన్నాయి. అయితే ఇక్కడ కిలో వెండి ధర రూ.2,54,000 లుగా ఉంది.

దేశంలోని ఇతర ప్రధాన నగరాల పరిస్థితి

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,46,000 గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,33,840 గా ఉంది. అక్కడ కిలో వెండి రేటు రూ.2,49,900 లుగా నమోదైంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,45,850గా, 22 క్యారెట్ల ధర రూ.1,33,690గా ఉంది. అలాగే కర్ణాటక రాజధాని బెంగళూరులో కూడా ముంబై తరహాలోనే 24 క్యారెట్ల ధర రూ.1,45,850, 22 క్యారెట్ల ధర రూ.1,33,690గా కొనసాగుతున్నాయి. ఈ రెండు నగరాల్లోనూ కిలో వెండి ధర రూ.2,49,900 లుగా ఉంది. ఇక తమిళనాడు రాజధాని చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,48,030 గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,35,690 వద్ద ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.2,54,900 లుగా నమోదైంది.

Tags:    

Similar News