EPFO: UPI ద్వారా పీఎఫ్ డ‌బ్బులు తీసుకునే రోజులు వ‌చ్చేస్తున్నాయ్‌!

EPFO: ఉద్యోగులకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) శుభవార్త చెప్పింది. త్వరలో PF డబ్బులను నేరుగా UPI ద్వారా బ్యాంకు ఖాతాల్లో జమ చేసే సదుపాయాన్ని తీసుకురానుంది.

Update: 2026-06-02 10:09 GMT

EPFO: UPI ద్వారా పీఎఫ్ డ‌బ్బులు తీసుకునే రోజులు వ‌చ్చేస్తున్నాయ్‌!

EPFO: ఉద్యోగులకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) శుభవార్త చెప్పింది. త్వరలో PF డబ్బులను నేరుగా UPI ద్వారా బ్యాంకు ఖాతాల్లో జమ చేసే సదుపాయాన్ని తీసుకురానుంది. దీంతో PF ఉపసంహరణ ప్రక్రియ మరింత సులభం కానుంది. అయితే ఈ సేవను పొందాలంటే ఖాతాదారులు కొన్ని ప‌నులు చేయాల్సి ఉంటుంది.

UPI ద్వారా PF డబ్బులు

కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయా తెలిపిన వివరాల ప్రకారం, EPFO 3.0లో భాగంగా ఉద్యోగులు తమ UPIకి అనుసంధానమైన బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా PF డబ్బులను పొందగలరు. ఈ కొత్త సాంకేతిక వ్యవస్థకు సంబంధించిన పరీక్షలు కూడా పూర్తయ్యాయి. ఇప్పటికే రూ.5 లక్షల వరకు PF క్లెయిమ్‌లకు ఆటో సెటిల్‌మెంట్ విధానాన్ని EPFO అమలు చేస్తోంది. దీంతో క్లెయిమ్‌ల పరిష్కారం వేగవంతమైంది. ఇప్పుడు UPI సేవ అందుబాటులోకి వస్తే డబ్బులు మరింత త్వరగా పొందే అవకాశం ఉంటుంది.

UAN యాక్టివేషన్ తప్పనిసరి

PFకు సంబంధించిన అన్ని డిజిటల్ సేవలకు యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) ప్రధాన ఆధారం. మీ UAN ఇంకా యాక్టివ్ కాకపోతే వెంటనే యాక్టివేట్ చేసుకోవాలి. అలాగే పాస్‌వర్డ్ మర్చిపోయినట్లయితే లేదా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మారినట్లయితే వాటిని వెంటనే అప్‌డేట్ చేసుకోవాలి. UAN యాక్టివ్‌గా లేకపోతే KYC ప్రక్రియలు కూడా పూర్తి చేయలేరు.

KYC వివరాలు సరిచూసుకోండి

PF క్లెయిమ్‌లు ఎక్కువగా నిలిచిపోవడానికి KYCలో పొరపాట్లే ప్రధాన కారణం. EPFO రికార్డుల్లో ఉన్న పేరు, పుట్టిన తేదీ, లింగం వంటి వివరాలు ఆధార్ కార్డులో ఉన్న వివరాలకు పూర్తిగా సరిపోవాలి. అలాగే PAN కార్డు UANతో లింక్ అయి ఉండాలి. PAN ధృవీకరణ పూర్తి కాకపోతే PF ఉపసంహరణ సమయంలో అధిక TDS కోత పడే అవకాశం ఉంది. అంతేకాకుండా డిజిటల్ వెరిఫికేషన్ ప్రక్రియలో కూడా ఇబ్బందులు ఎదురవుతాయి.

బ్యాంకు ఖాతా, మొబైల్ నంబర్ వివరాలు ఖచ్చితంగా ఉండాలి

UPI ద్వారా డబ్బులు నేరుగా జమ కానున్నందున బ్యాంకు ఖాతా వివరాలు తప్పులేకుండా ఉండాలి. ఖాతా సంఖ్య, IFSC కోడ్, ఖాతాదారుడి పేరు సరైనవిగా నమోదు అయ్యాయో లేదో పరిశీలించాలి. మూసివేసిన బ్యాంకు ఖాతా వివరాలు ఉంటే వెంటనే మార్చాలి. అలాగే UPI ఐడీ యాక్టివ్‌గా ఉండాలి. OTP ధృవీకరణ కోసం ఆధార్, UAN, UPI ఖాతాల్లో ఒకే మొబైల్ నంబర్ నమోదు చేసి ఉండటం మంచిది. దీంతో ధృవీకరణ ప్రక్రియ వేగంగా పూర్తవుతుంది.

ఉద్యోగ రికార్డులు, నామినీ వివరాలు అప్‌డేట్ చేయండి

EPF ఖాతాలో గత ఉద్యోగాల వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో పరిశీలించాలి. కొన్నిసార్లు పాత కంపెనీ నుంచి రిలీవ్ అయిన తేదీ నమోదు కాకపోవడం లేదా పాత PF ఖాతాలు కొత్త ఖాతాతో అనుసంధానం కావు. దీంతో క్లెయిమ్‌ల పరిష్కారంలో ఆలస్యం కావచ్చు. అలాగే ఈ-నామినేష‌న్ వివరాలను కూడా ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలి. వివాహం, కుటుంబంలో కొత్త సభ్యుల చేరిక లేదా ఆధారపడిన వారి వివరాల్లో మార్పులు ఉంటే వెంటనే నమోదు చేయాలి. ఇలా చేస్తే అత్యవసర పరిస్థితుల్లో క్లెయిమ్ ప్రక్రియ సులభంగా పూర్తవుతుంది.

Tags:    

Similar News