EPFO: రిటైర్మైంట్ కంటే ముందే ఉద్యోగం మానేస్తే.. పీఎఫ్ డబ్బు ఏమవుతుంది.? రూల్స్ ఏం చెబుతున్నాయి?
EPFO: రిటైర్మైంట్ కంటే ముందే ఉద్యోగం మానేసే వారి సంఖ్య పెరుగుతోంది. సొంతంగా వ్యాపారం చేయడం, లేదా కెరీర్‌ను మార్చుకోవడం వంటివి చేస్తున్నారు.
EPFO: రిటైర్మైంట్ కంటే ముందే ఉద్యోగం మానేస్తే.. పీఎఫ్ డబ్బు ఏమవుతుంది.? రూల్స్ ఏం చెబుతున్నాయి?
EPFO: రిటైర్మైంట్ కంటే ముందే ఉద్యోగం మానేసే వారి సంఖ్య పెరుగుతోంది. సొంతంగా వ్యాపారం చేయడం, లేదా కెరీర్‌ను మార్చుకోవడం వంటివి చేస్తున్నారు. అయితే ఉద్యోగం వదిలేస్తే తమ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) ఖాతాలోని డబ్బుకు వడ్డీ కొనసాగుతుందా? లేక ఖాతా మూసివేస్తారా? అన్న ప్రశ్న రావడం సహజం.
ఉద్యోగం వదిలినా 58 ఏళ్ల వరకు PFపై వడ్డీ
EPFO నిబంధనల ప్రకారం మీరు 40 లేదా 45 ఏళ్ల వయసులో ఉద్యోగం వదిలేసినా మీ PF ఖాతా వెంటనే క్లోజ్ అవ్వదు. అంతేకాదు, ఖాతాలో ఉన్న మొత్తంపై 58 ఏళ్ల వయసు వరకు వడ్డీ లభిస్తూనే ఉంటుంది. అయితే ఇందుకోసం ఖాతాలోని డబ్బును పూర్తిగా ఉపసంహరించుకోకుండా ఉంచాలి. అలా ఉంచితే ప్రతి సంవత్సరం EPFO ప్రకటించే వడ్డీ రేటు ప్రకారం మీ PF బ్యాలెన్స్ పెరుగుతూ ఉంటుంది.
58 ఏళ్ల తర్వాత ఎందుకు వడ్డీ ఆగిపోతుంది?
EPFO నిబంధనల ప్రకారం 58 ఏళ్ల వయసును పదవీ విరమణ వయసుగా పరిగణిస్తారు. అందుకే 58 ఏళ్లు పూర్తైన తర్వాత కూడా PF ఖాతాలో డబ్బు అలాగే ఉంచితే, ఆ మొత్తంపై ఇకపై ఎలాంటి వడ్డీ చెల్లించరు. అంటే 58 ఏళ్ల వరకు మాత్రమే వడ్డీ ప్రయోజనం లభిస్తుంది. ఆ తర్వాత ఖాతాలో డబ్బు ఉన్నా అదనపు వడ్డీ జమ కాదు.
ఉద్యోగం వదిలిన తర్వాత PF డబ్బును ఎలా వినియోగించుకోవచ్చు?
ఉద్యోగం వదిలిన తర్వాత మీ అవసరాలను బట్టి PF ఖాతాలోని డబ్బును వినియోగించుకునే అవకాశం ఉంటుంది. మీరు నిరుద్యోగిగా ఉంటే EPFO నిబంధనల ప్రకారం కొంత మొత్తాన్ని ముందస్తుగా (అడ్వాన్స్‌గా) తీసుకోవచ్చు. మిగిలిన మొత్తాన్ని నిర్ణీత నిబంధనల ప్రకారం తర్వాత ఉపసంహరించుకోవచ్చు. అయితే అత్యవసర అవసరం లేకపోతే డబ్బును ఖాతాలోనే ఉంచడం వల్ల వడ్డీ ప్రయోజనం కొనసాగుతుంది.
కొత్త ఉద్యోగంలో చేరితే PF ఖాతా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు
మీరు మరో కంపెనీలో ఉద్యోగంలో చేరితే పాత PF ఖాతాను కొత్త కంపెనీ PF ఖాతాకు చాలా సులభంగా బదిలీ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మీ సేవా కాలం కొనసాగుతుంది. అలాగే అన్ని PF పొదుపులు ఒకే ఖాతాలో చేరి భవిష్యత్తులో డబ్బు ఉపసంహరణ, పెన్షన్ ప్రయోజనాలు పొందడం కూడా సులభమవుతుంది.
PF ఖాతా ఎప్పుడు ఇన్‌యాక్టివ్ అవుతుంది?
ఉద్యోగం వదిలిన తర్వాత చాలా కాలం పాటు కొత్తగా PF చందాలు జమ కాకపోతే, అలాగే ఖాతాను కొత్త ఉద్యోగానికి బదిలీ చేయకపోతే అది ఇన్‌యాక్టివ్‌గా మారే అవకాశం ఉంది. అందుకే ఉద్యోగం మారిన వెంటనే పాత PF ఖాతాను కొత్త ఖాతాకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో భవిష్యత్తులో క్లెయిమ్‌లు, ఉపసంహరణలు లేదా ఇతర సేవలు పొందడంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు.