Credit Card: క్రెడిట్ కార్డు EMI ట్రాప్‌లో పడిపోయారా.? ఎలా బయటపడాలంటే..
Credit Card: ఈ రోజుల్లో చాలా మంది ఖర్చులు మేనేజ్ చేయడానికి క్రెడిట్ కార్డులు ఉపయోగిస్తున్నారు. అయితే సరిగ్గా వాడకపోతే ఇబ్బందులు రావడం ఖాయం.
Credit Card
Credit Card: ఈ రోజుల్లో చాలా మంది ఖర్చులు మేనేజ్ చేయడానికి క్రెడిట్ కార్డులు ఉపయోగిస్తున్నారు. అయితే సరిగ్గా వాడకపోతే ఇబ్బందులు రావడం ఖాయం. ముఖ్యంగా క్రెడిట్ కార్డు EMI ట్రాప్‌లో పడి ఇరుక్కుపోయే వారు చాలా మంది ఉంటారు. మరి దీన్ని ఎలా చేధించాలంటే.
క్రెడిట్ కార్డ్ EMIలు ఎందుకు భారంగా మారుతాయి?
మొదట్లో చిన్న చిన్న ఖర్చులకు తీసుకున్న EMIలు తర్వాత పెరుగుతూ పెద్ద మొత్తం అవుతాయి. ప్రతి కార్డ్‌కు వేర్వేరు వడ్డీ రేట్లు ఉండటం వల్ల మొత్తం మీద ఎక్కువ డబ్బు చెల్లించాల్సి వస్తుంది. దీంతో నెలకు ఎంత చెల్లిస్తున్నామో కూడా కచ్చితంగా తెలియకుండా ఆర్థికంగా ఒత్తిడి పెరుగుతుంది. ఈ పరిస్థితిలో చాలా మంది ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అర్థం కాక ఇబ్బంది పడుతుంటారు.
పర్సనల్ లోన్‌తో సమస్యకు పరిష్కారం
ఈ సమస్య నుంచి బయటపడటానికి పర్సనల్ లోన్ ఒక మంచి ఆప్షన్‌గా ఉపయోగపడుతుంది. మీ దగ్గర ఉన్న అన్ని క్రెడిట్ కార్డుల బకాయిలను కలిపి ఒకేసారి పర్సనల్ లోన్ తీసుకుంటే, ఆ డబ్బుతో అన్ని EMIలను క్లోజ్ చేయవచ్చు. అలా చేస్తే మీరు ఒక్క లోన్ EMI మాత్రమే చెల్లించాలి. సాధారణంగా పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు క్రెడిట్ కార్డులతో పోలిస్తే తక్కువగా ఉంటాయి. అందువల్ల మొత్తం వడ్డీ భారం తగ్గుతుంది.
ఎలా ప్లాన్ చేయాలి?
ముందుగా మీ దగ్గర ఉన్న అన్ని క్రెడిట్ కార్డుల బకాయిలను కలిపి మొత్తం ఎంత ఉందో లెక్క వేయాలి. ఆ మొత్తానికి సరిపడే పర్సనల్ లోన్ తీసుకోవాలి. తర్వాత వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు, ఇతర ఛార్జీలు అన్నీ పోల్చి సరైన లోన్ ఎంపిక చేసుకోవాలి. లోన్ టెన్యూర్‌ను కూడా జాగ్రత్తగా నిర్ణయించాలి. చాలా ఎక్కువ కాలం కాకుండా 3 నుంచి 5 సంవత్సరాల మధ్య ఉంచడం మంచిది. లోన్ వచ్చిన వెంటనే అన్ని కార్డుల EMIలను పూర్తిగా క్లోజ్ చేసి, అనవసరంగా వాటిని మళ్లీ ఉపయోగించకుండా ఉండాలి.
జాగ్రత్తలు, లాభాలు
ఈ విధంగా చేస్తే మీరు ముందుగా చెల్లిస్తున్న అనేక EMIలు ఒకటిగా మారి నిర్వహించడం సులభమవుతుంది. వడ్డీ కూడా తగ్గి నెలకు చెల్లించే మొత్తం తగ్గే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని విషయాలు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఎక్కువ వడ్డీ రేటుతో లోన్ తీసుకోవద్దు. అలాగే లోన్ తీసుకున్న తర్వాత మళ్లీ క్రెడిట్ కార్డులను అధికంగా వాడకూడదు. అవసరమైతే ఒక కార్డ్ మాత్రమే ఉపయోగించాలి. సరైన నియంత్రణ ఉంటే ఈ విధానం మీ ఆర్థిక పరిస్థితిని స్థిరంగా మార్చడంలో సహాయపడుతుంది.