Post Office: రూ.5 లక్షలు పెడితే రూ.10 లక్షలు.. ఈ అద్భతమైన స్కీమ్ గురించి మీకు తెలుసా..?
Post Office: మీరు పెట్టిన పెట్టుబడికి ప్రభుత్వ హామీతో పాటు రెట్టింపు లాభం కావాలా? అయితే పోస్ట్ ఆఫీస్ కిసాన్ వికాస్ పత్ర సరైన ఎంపిక.
Post Office: రూ.5 లక్షలు పెడితే రూ.10 లక్షలు.. ఈ అద్భతమైన స్కీమ్ గురించి మీకు తెలుసా..?
Kisan Vikas Patra: డబ్బు సంపాదించడం ఒక ఎత్తయితే, ఆ సంపాదించిన సొమ్మును భద్రంగా దాచుకుని రెట్టింపు చేసుకోవడం మరో ఎత్తు. ముఖ్యంగా మధ్యతరగతి వారు తమ కష్టార్జితం విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరు. స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులు, మ్యూచువల్ ఫండ్స్‌లో అనిశ్చితి భయపెడుతున్న వేళ.. కేంద్ర ప్రభుత్వ హామీతో కూడిన పోస్ట్ ఆఫీస్ కిసాన్ వికాస్ పత్ర ఒక అద్భుతమైన వరంగా కనిపిస్తోంది.
ఎప్పుడు డబుల్ అవుతుంది?
సాధారణంగా బ్యాంకు ఎఫ్డీల కంటే మెరుగైన లాభాలను ఆశించే వారికి ఈ స్కీమ్ సరైన వేదిక. ప్రస్తుతం ప్రభుత్వం ఈ పథకంపై 7.5 శాతం వార్షిక వడ్డీని అందిస్తోంది. ఈ వడ్డీ రేటు ప్రకారం మీ పెట్టుబడి సరిగ్గా 115 నెలల్లో రెట్టింపు అవుతుంది.మీరు రూ. 5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే.. గడువు ముగిశాక మీ చేతికి రూ. 10 లక్షలు అందుతాయి.ఒకవేళ రూ. 10 లక్షలు పెట్టుబడి పెడితే.. అది ఏకంగా రూ. 20 లక్షలు అవుతుంది. ఇందులో గరిష్ట పరిమితి లేదు, కాబట్టి మీ స్తోమతను బట్టి ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు. భారతీయ పౌరులందరికీ ఈ పథకం అందుబాటులో ఉంది.ఒంటరిగా లేదా ముగ్గురు వ్యక్తులు కలిసి ఖాతా తెరవవచ్చు.మీ పిల్లల భవిష్యత్తు కోసం వారి పేరు మీద కూడా పెట్టుబడి పెట్టవచ్చు.కనీసం రూ. 1,000 తోనే మీ పెట్టుబడి ప్రయాణాన్ని మొదలుపెట్టవచ్చు.
అత్యవసరమైతే డబ్బు తీసుకోవచ్చా?
చాలామంది దీర్ఘకాలిక పథకాల్లో డబ్బు లాక్ అయిపోతుందని భయపడతారు. కానీ కిసాన్ వికాస్ పత్రలో ఆ చింత అక్కర్లేదు.పెట్టుబడి పెట్టిన రెండున్నర ఏళ్ల తర్వాత ఎప్పుడైనా మీ డబ్బును వెనక్కి తీసుకోవచ్చు. అయితే మెచ్యూరిటీ వరకు ఉంటేనే పూర్తిస్థాయిలో రెట్టింపు సొమ్ము అందుతుంది. అత్యవసరంగా డబ్బు కావాల్సి వస్తే, మీ కేవీపీ సర్టిఫికేట్‌ను తాకట్టు పెట్టి బ్యాంకుల్లో లోన్ తీసుకోవచ్చు. దీనివల్ల మీ పెట్టుబడి పెరుగుతూనే ఉంటుంది, మీ ఆర్థిక అవసరాలూ తీరుతాయి.
ఎందుకు ఎంచుకోవాలి?
కిసాన్ వికాస్ పత్ర కేవలం ఒక పొదుపు పథకం మాత్రమే కాదు, అది ఒక ఆర్థిక రక్షణ కవచం. మీ డబ్బుకు వంద శాతం భద్రత ఉంటుంది. మీరు ఒక ఊరి నుంచి మరో ఊరికి మారితే, మీ అకౌంట్‌ను కూడా దగ్గరలోని పోస్ట్ ఆఫీస్‌కు బదిలీ చేసుకోవచ్చు.పదవీ విరమణ తర్వాత ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలనుకునే వారికి, పిల్లల పెళ్లిళ్లు లేదా ఉన్నత చదువుల కోసం ప్లాన్ చేసే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.