Tata Motors : ఇటు పెట్రోల్ అటు ఆల్కహాల్.. మార్కెట్లో 5 కొత్త ఎలక్ట్రిక్ కార్లు..టాటా ప్లాన్ మామూలుగా లేదుగా..

Tata Motors : టాటా మోటార్స్ 2026లో 5 కొత్త ఎలక్ట్రిక్ కార్లను, ఒక ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాన్ని లాంచ్ చేయబోతోంది.

Update: 2026-05-17 05:03 GMT

Tata Motors

Tata Motors : భారత ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ భవిష్యత్తు ప్రయాణం కోసం భారీ స్కెచ్ వేసింది. 2045 నాటికి పూర్తిగా నెట్ జీరో ఎమిషన్ లక్ష్యాన్ని చేరుకోవడమే ధ్యేయంగా కంపెనీ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలు (EV), సిఎన్జి (CNG),హైడ్రోజన్ ఫ్యూయల్ టెక్నాలజీపై వేల కోట్లు పెట్టుబడి పెడుతోంది. 2030 నాటికి దేశీయ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో దాదాపు 50 శాతం వాటాను కైవసం చేసుకోవాలని టాటా లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా 2026 సంవత్సరం టాటా మోటార్స్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలవబోతోంది.

2026లో రాబోతున్న టాటా కొత్త కార్లు ఇవే

వచ్చే ఏడాది టాటా మోటార్స్ ఏకంగా నాలుగు ప్రధాన ఎలక్ట్రిక్ మోడళ్లను మార్కెట్లోకి తీసుకురానుంది. ఇందులో మధ్యతరగతి ప్రజలకు ఇష్టమైన టియాగో ఈవీ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ సరికొత్త లుక్‌తో రాబోతోంది. దీనితో పాటు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న టాటా సిక్రా ఈవీ, లగ్జరీ సెగ్మెంట్లో సఫారీ ఈవీ, ప్రీమియం బ్రాండ్ అవిన్యా నుంచి తొలి మోడల్ విడుదల కానున్నాయి. ఇవే కాకుండా టాటా నుంచి తొలిసారిగా ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజిన్‌తో నడిచే వాహనం కూడా 2026 చివరిలో లేదా 2027 ఆరంభంలో రోడ్డెక్కనుంది.

సరికొత్త హంగులతో టియాగో, సఫారీ ఈవీ

కొత్త టియాగో ఈవీలో రీడిజైన్ చేసిన హెడ్‌ల్యాంప్స్, కొత్త గ్రిల్, అలోయ్ వీల్స్ ఉండబోతున్నాయి. ముఖ్యంగా దీని రేంజ్‌ను పెంచేందుకు పెద్ద బ్యాటరీ ప్యాక్ ఆప్షన్‌ను టాటా పరిశీలిస్తోంది. ఇక సఫారీ ఈవీ విషయానికొస్తే.. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ మైలేజీని ఇస్తుందని సమాచారం. దీని ప్రొడక్షన్ ఆగస్టులో మొదలై, 2026 దీపావళి నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇది అడ్వాన్స్‌డ్ యాక్టి.ఈవీ+ ప్లాట్‌ఫారమ్‌పై రూపొందుతోంది.

టాటా నుంచి వస్తున్న లగ్జరీ బ్రాండ్

టాటా మోటార్స్ తన అత్యంత ప్రతిష్టాత్మకమైన Gen-3 స్కేట్‌బోర్డ్ ఆర్కిటెక్చర్‌పై అవిన్యా సిరీస్ కార్లను తయారు చేస్తోంది. ఇవి కేవలం కార్లు మాత్రమే కాదు, చక్రాలపై నడిచే అధునాతన గ్యాడ్జెట్లుగా ఉండబోతున్నాయి. అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయంతో వస్తున్న అవిన్యా బ్రాండ్లో మొదట స్పోర్ట్‌బ్యాక్ మోడల్, ఆ తర్వాత ఎస్‌యూవీలు రానున్నాయి. వీటితో పాటు టాటా పంచ్ ఫ్లెక్స్-ఫ్యూయల్ మోడల్ కూడా హైలైట్‌గా నిలవనుంది. ఇది ఇథనాల్ కలిపిన ఇంధనంతో నడుస్తూ కాలుష్యాన్ని భారీగా తగ్గిస్తుంది.

Tags:    

Similar News