Toyota Hilux : ఫార్చ్యూనర్‌కు బాప్ లాంటిది.. జూలై 28న దిగనున్న టయోటా బ్రహ్మాస్త్రం
Toyota Hilux : నెక్స్ట్-జనరేషన్ టయోటా హైలక్స్ జూలై 28న భారత్‌లో లాంచ్ కానుంది. కొత్త డిజైన్, 12.3-ఇంచ్ స్క్రీన్స్, ADAS, మైల్డ్-హైబ్రిడ్ ఇంజిన్‌తో వస్తున్న ఈ ఎస్‌యూవీ వివరాలు తెలుసుకుందాం.
Toyota Hilux
Toyota Hilux : ఆటోమొబైల్ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన జపనీస్ కార్ల తయారీ దిగ్గజం టయోటా, భారత మార్కెట్లో తన ఆధిపత్యాన్ని మరింత పెంచుకునేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే కంపెనీకి చెందిన మోస్ట్ పాపులర్ లైఫ్‌స్టైల్ పిక్-అప్ ఎస్‌యూవీ నెక్స్ట్-జనరేషన్ టయోటా హైలక్స్ జూలై 28, 2026న భారత మార్కెట్లో అధికారికంగా విడుదల కానుంది. లాంచ్‌కు కేవలం కొద్ది రోజుల సమయం మాత్రమే ఉండటంతో, కంపెనీ ఈ కారుకు సంబంధించిన సరికొత్త టీజర్‌ను విడుదల చేసి వాహన ప్రియుల్లో అంచనాలను పెంచేసింది.
అగ్రెసివ్ అండ్ మాసివ్ డిజైన్
టయోటా విడుదల చేసిన కొత్త టీజర్ ప్రకారం.. రాబోయే హైలక్స్ మోడల్ డిజైన్‌లో భారీ మార్పులు జరిగాయి. దీని ఫ్రంట్ ప్రొఫైల్‌లో హనీకోంబ్ ప్యాటర్న్‌తో కూడిన భారీ ఫ్రంట్ గ్రిల్‌ను అమర్చారు. దానికి తోడుగా స్లిమ్ డిజైన్ ఎల్‌ఈడీ హెడ్‌లాంప్స్, మస్కులర్ బంపర్, సిల్వర్ స్కిడ్ ప్లేట్, గ్రిల్ పైభాగంలో బోల్డ్‌గా రాసిన 'TOYOTA' అక్షరాలు కారుకు మరింత ప్రీమియం, అగ్రెసివ్, రగ్డ్ లుక్‌ను ఇస్తున్నాయి. సైడ్ ప్రొఫైల్‌లో కొత్త డిజైన్ అలాయ్ వీల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
లగ్జరీ ఇంటీరియర్, హైటెక్ ఫీచర్లు
బయట ఎంత రఫ్‌గా ఉంటుందో, లోపల అంత లగ్జరీగా ఉండేలా ఈ కారు ఇంటీరియర్‌ను టయోటా డిజైన్ చేసింది. కేబిన్ లోపల డ్యూయల్ 12.3-ఇంచ్ డిస్ప్లేలతో కూడిన సరికొత్త డాష్‌బోర్డ్ ఉంది. ఇందులో ఒకటి పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కాగా, మరొకటి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్. దీంతో పాటు వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ అండ్ పవర్డ్ ఫ్రంట్ సీట్లు, 360-డిగ్రీ కెమెరా, ప్రీమియం సౌండ్ సిస్టమ్ వంటి ఆధునిక సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. భద్రత కోసం 7 ఎయిర్‌బ్యాగ్‌లు, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) కూడా ఉండే అవకాశం ఉంది.
శక్తివంతమైన ఇంజిన్ – మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీ
పర్ఫార్మెన్స్ విషయానికొస్తే, కొత్త టయోటా హైలక్స్‌లో ఇప్పటికే ఉన్న నమ్మకమైన 2.8-లీటర్ టర్బో డిజైన్ ఇంజిన్‌ను కొనసాగించనున్నారు. ఈ ఇంజిన్ 204 PS పవర్ మరియు 500 Nm టార్క్‌ను ఉత్పత్త్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. విశేషమేమిటంటే, ఈసారి ఇందులో 48V మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీని కూడా అందించే అవకాశం ఉంది. దీనివల్ల మైలేజీ పెరగడమే కాకుండా, స్మూత్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ లభిస్తుంది. ఆఫ్-రోడింగ్ కోసం ప్రతిష్టాత్మక 4WD (ఫోర్-వీల్ డ్రైవ్) సిస్టమ్ స్టాండర్డ్‌గా వస్తుంది.
అంచనా ధర ఎంత ఉండొచ్చు?
ప్రస్తుతం భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న హైలక్స్ ధర రూ.28.52 లక్షల నుంచి రూ.36 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. సరికొత్త ఫీచర్లు, అప్‌డేటెడ్ డిజైన్‌తో వస్తున్న నెక్స్ట్-జెన్ మోడల్ ఆన్-రోడ్ ధర సుమారు 36 లక్షల నుంచి 46 లక్షల రూపాయల వరకు ఉండే అవకాశం ఉంది. ఈ హైలక్స్ లాంచ్ అయిన తర్వాత, ఇదే ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి వచ్చే నెక్స్ట్-జెన్ టయోటా ఫార్చ్యూనర్ కూడా త్వరలోనే భారత్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది.