Maruti Alto K10 : లీటర్ పెట్రోల్‌కు 34 కిమీ మైలేజీ.. రూ.3.99 లక్షల కారుపై రూ.50 వేల డిస్కౌంట్

Maruti Alto K10 : మారుతి సుజుకి ఆల్టో K10 పట్ల భారతీయ వినియోగదారులకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. గత నెల ఏప్రిల్ 2026లో కూడా ఈ కారు రికార్డు స్థాయిలో అమ్ముడైంది.

Update: 2026-05-04 02:45 GMT

Maruti Alto K10

Maruti Alto K10 : మధ్యతరగతి ప్రజల కలల కారు, ఇండియన్ రోడ్లపై రారాజుగా వెలుగొందుతున్న మారుతి సుజుకి ఆల్టో మరోసారి వార్తల్లో నిలిచింది. అదిరిపోయే మైలేజీ, తక్కువ ధరతో సామాన్యులకు చేరువైన ఆల్టో K10 మోడల్‌పై ఇప్పుడు కంపెనీ భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. కొత్త కారు కొనాలనుకునే వారికి మే 2026 నెల ఒక గొప్ప అవకాశంగా మారబోతోంది. అటు అమ్మకాల్లోనూ, ఇటు ఆఫర్లలోనూ ఈ కారు దూసుకుపోతోంది. మారుతి సుజుకి ఆల్టో K10 పట్ల భారతీయ వినియోగదారులకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. గత నెల ఏప్రిల్ 2026లో కూడా ఈ కారు రికార్డు స్థాయిలో అమ్ముడైంది. ఇప్పుడు మే నెలలో ఈ కారును మరింత చేరువ చేసేందుకు కంపెనీ ఏకంగా రూ.52,500 వరకు డిస్కౌంట్లను ప్రకటించింది. ఇందులో నేరుగా ఇచ్చే క్యాష్ డిస్కౌంట్‌తో పాటు ఎక్స్ఛేంజ్ బోనస్, ఇతర బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. మీరు మీ సమీప డీలర్‌ను సంప్రదిస్తే ఈ ఆఫర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

ఆల్టో K10 కొత్త మోడల్ చూడటానికి చాలా ఫ్రెష్‌గా, మోడ్రన్‌గా ఉంటుంది. ఫ్రంట్ గ్రిల్, షార్ప్ హెడ్‌లైట్లు కారుకు కొత్త లుక్‌ను ఇస్తాయి. లోపల ఇంటీరియర్ గురించి చెప్పాలంటే.. ఇది బడ్జెట్ కారే అయినా ఫీచర్లలో ఏమాత్రం తగ్గదు. ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటోను సపోర్ట్ చేసే టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇందులో ఉంది. పవర్ విండోస్, మెరుగైన డ్యాష్‌బోర్డ్ లేఅవుట్ ఈ కారుకు ప్రీమియం ఫీల్‌ను ఇస్తాయి.

ఆల్టో కారుకు ఉన్న అతిపెద్ద బలం దాని మైలేజీ. ఇందులో నెక్స్ట్ జెనరేషన్ కె-సిరీస్ 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ అమర్చారు. ఇది మాన్యువల్, ఆటోమేటిక్ (AGS) గేర్ బాక్స్ ఆప్షన్లలో లభిస్తుంది. పెట్రోల్ వేరియంట్ సుమారు 24.39 కిమీ మైలేజీ ఇస్తుండగా, సిఎన్‌జి (CNG) వేరియంట్ ఏకంగా కిలోకు 33.85 కిమీ మైలేజీ ఇస్తుంది. అందుకే దేశంలో ఇప్పటివరకు 50 లక్షలకు పైగా ఆల్టో కార్లు అమ్ముడై ఆల్-టైమ్ బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలిచింది.

బడ్జెట్ కారు కదా అని సేఫ్టీని కంపెనీ పక్కన పెట్టలేదు. కొత్త ఆల్టో K10లో డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, ఏబీఎస్ (ABS) విత్ ఈబీడీ (EBD), రియర్ పార్కింగ్ సెన్సార్ల వంటి ముఖ్యమైన ఫీచర్లు స్టాండర్డ్ వేరియంట్ లోనే వస్తాయి. పిల్లల భద్రత కోసం చైల్డ్ లాక్ సౌకర్యం కూడా ఉంది. ఈ కారు ఎక్స్ షోరూమ్ ప్రారంభ ధర రూ.3.99 లక్షల నుంచి మొదలై టాప్ మోడల్ రూ.5.96 లక్షల వరకు ఉంటుంది.

Tags:    

Similar News