September 2026: మకర, కుంభ, మీనరాశి ఫలితాలుః సెప్టెంబర్‌లో భారీ మార్పులు...కలిసి వచ్చే రంగులు ఇవే

సెప్టెంబర్ 2026 నెలకు సంబంధించి మకర, కుంభ, మీన రాశుల వ్యక్తిగత జీవితం, కలిసివచ్చే రంగులు, అదృష్ట రత్నాల వివరాలు తెలుసుకుందాం.

Update: 2026-09-04 03:39 GMT

September 2026: సెప్టెంబర్‌ 2026 నెలలో మకరం, కుంభం, మీనం రాశుల వారికి జీవితంలో కొన్ని కీలకమైన మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఈ మూడు రాశులు ఒకే కాలాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ ఫలితాల తీరు మాత్రం భిన్నంగా ఉంటుంది. మకర రాశివారు సంబంధాల్లో ఓర్పు నేర్చుకోవాల్సి వస్తే.. కుంభ రాశివారికి ఆత్మపరిశీలన అవసరమయ్యే పరిస్థితులు ఎదురుకావచ్చు. మీన రాశివారు మాత్రం తమ భావోద్వేగాలకు, వ్యక్తిగత జీవితానికి మధ్య సరైన హద్దులను ఏర్పరచుకోవడం ముఖ్యమవుతుంది. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం గ్రహాల సంచారం మన ఆలోచనలు, నిర్ణయాలు, సంబంధాలపై ప్రభావం చూపుతుందని భావిస్తారు. అందుకే సెప్టెంబర్ నెలలో ఈ మూడు రాశుల వారు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తే పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకునే అవకాశం ఉంటుంది.

మకరరాశి

సెప్టెంబర్‌లో మకర రాశివారి వ్యక్తిగత జీవితం పూర్తిగా సాఫీగా సాగకపోయినా, నెల గడిచేకొద్దీ పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉంది. కుజుడి ప్రభావంతో జీవిత భాగస్వామి లేదా అత్యంత సన్నిహిత వ్యక్తులతో చిన్నచిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు. ముఖ్యంగా ఎదుటివారి మాటను పూర్తిగా వినకుండా వెంటనే స్పందించడం సమస్యను పెంచవచ్చు. మీకు ఎంతో ఇష్టమైన వ్యక్తుల విషయంలో ఎక్కువగా ఆలోచించడం, వారి భద్రత గురించి ఆందోళన చెందడం కూడా కనిపించవచ్చు. అయితే ఇది ప్రేమతో వచ్చిన శ్రద్ధే అయినప్పటికీ, ఎదుటివారికి ఒత్తిడిగా అనిపించకుండా చూసుకోవాలి.

సెప్టెంబర్ 27 తర్వాత పరిస్థితుల్లో కొంత సానుకూల మార్పు కనిపించే అవకాశం ఉంది. దూరమైన బంధాలు మళ్లీ దగ్గరవుతాయి. కుటుంబంలో అనుబంధం పెరుగుతుంది. ఈ సమయంలో ప్రశాంతంగా ఉండేందుకు ధ్యానం, యోగా లేదా ఆధ్యాత్మిక సాధన ఉపకరిస్తాయి.

సెప్టెంబర్‌లో ఈ రాశివారికి నలుపు, ముదురు నీలరం రంగు, బూడిద రంగు దుస్తులు కలిసి వస్తాయి. ఈ నెలలో ఈరాశివారు నీలం, గార్నెట్‌, కార్నెలియన్‌ రత్నాలు కలిసి వస్తాయి.

కుంభరాశి

కుంభ రాశివారికి సెప్టెంబర్ నెలలో బయట ప్రపంచం కంటే తమలో తాము సాగించే ఆలోచనలే ఎక్కువగా ప్రభావం చూపవచ్చు. శని, రాహు ప్రభావం కారణంగా కొన్నిసార్లు కారణం లేకుండానే మానసిక ఒత్తిడి లేదా అసంతృప్తి కలగవచ్చు. కుటుంబ సభ్యులు, స్నేహితులు మీ మాటను తప్పుగా అర్థం చేసుకున్నట్లు అనిపించవచ్చు. గతంలో పాటించిన కొన్ని అలవాట్లు ఇప్పుడు మీకు సరిపోవడం లేదనే భావన కలుగుతుంది. ఇలాంటి సమయంలో పాత విషయాలను పట్టుకుని బాధపడకుండా, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మారడం మంచిది.

సెప్టెంబర్ 10 తర్వాత డబ్బు, సంబంధాలు లేదా భవిష్యత్తు ప్రణాళికలకు సంబంధించి కొత్త ఆలోచనలు మొదలయ్యే అవకాశం ఉంది. ముఖ్యమైన నిర్ణయాలను తొందరగా కాకుండా ఆలోచించి తీసుకోవడం మంచిది. సెప్టెంబర్‌ నెలలో ఈ రాశివారికి ఆకాశనీలం, ఊదా లేదా ఎలక్ట్రిక్‌ బ్లూ రంగులు కలిసి వస్తాయి. ఇక ఈ రాశివారు నీలం లేదా పచ్చలు ధరించడం వలన మేలు జరుగుతుంది.

మీనరాశి

సెప్టెంబర్ నెల మీన రాశివారికి ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పించే అవకాశం ఉంది. అదే ఎవరికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి, ఎక్కడ వరకు బాధ్యత తీసుకోవాలి అనే విషయం. అందరినీ సంతోషపెట్టాలనే ప్రయత్నంలో మీ స్వంత ప్రశాంతతను కోల్పోకుండా జాగ్రత్తపడాలి. భావోద్వేగాల ప్రభావంతో కొన్ని ఆర్థిక లేదా వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు రావచ్చు. అందువల్ల ముఖ్యమైన విషయాల్లో ఒకసారి ఆగి ఆలోచించడం అవసరం. సన్నిహితులతో అనుబంధం పెంచుకోవడానికి నేరుగా మాట్లాడటం, మనసులోని విషయాలను స్పష్టంగా చెప్పడం మంచిది.

సెప్టెంబర్ 26 పౌర్ణమి సమయం మీపై కొంత భావోద్వేగ ప్రభావాన్ని చూపవచ్చని జ్యోతిష్య పరంగా భావించవచ్చు. ఆ సమయంలో ఎక్కువ ఒత్తిడి తీసుకోకుండా విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వాలి. జీవితాన్ని కేవలం బాధ్యతలతో నింపకుండా, చిన్న చిన్న ఆనందాలను ఆస్వాదించడం కూడా అవసరమే.

సెప్టెంబర్‌ నెలలో ఈ రాశివారికి పసుపు, లేత ఆకుపచ్చ, తెలుపు రంగు దుస్తులు కలిసి వస్తాయి. ఇక ఈ మాసంలో మీనరాశివారు కనకపుష్యరాగం లేదా ఆక్వామెరైన్‌ రత్నాలు ధరించడం వలన మేలు జరుగుతుంది.

గమనికః ఇక్కడ ఇచ్చినవి రాశి ఫలితాలు కేవలం సామాన్యమైనవి మాత్రమే. పూర్తిస్థాయి వ్యక్తిగత జాతక ఫలితాల కోసం నిపుణులైన జ్యోతిష్య పండితులను సంప్రదించండి. 

Tags:    

Similar News