Maha Bhagya Yoga: ఈ ఆరు రాశులకు మహా అదృష్టం.. ధనలాభం, ఉద్యోగంలో పురోగతి

Maha Bhagya Yoga: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవంబర్ 22న శుక్రుడు తులా రాశిలోకి ప్రవేశించనున్నాడు.

ఇప్పటికే అక్కడ సంచరిస్తున్న బుధుడితో డిసెంబర్ 2 వరకు కలిసి ఉండనున్నాడు.

ఈ గ్రహాల కలయికతో ఆరు రాశుల వారికి ధనలాభం, ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి కలిగే అవకాశాలున్నాయి.

మేష రాశి వారికి ఆర్థికంగా మెరుగైన పరిస్థితులు

మేష రాశివారికి ఏడో స్థానంలో బుధ, శుక్రుల కలయిక జరగనుంది. దీంతో ఆదాయాన్ని పెంచుకునే అవకాశాలు లభిస్తాయి. రావాల్సిన బకాయిలు చేతికి అందవచ్చు. భూములు, ఇళ్ల కొనుగోలు, అమ్మకాల ద్వారా లాభాలు పొందే సూచనలు ఉన్నాయి. జీవిత భాగస్వామి తరఫు నుంచి ఆస్తి ప్రయోజనాలు కలగవచ్చు. ఉద్యోగులు, వ్యాపారులకు కూడా అనుకూల సమయం.

మిథున రాశి వారికి ఆకస్మిక ధనలాభం

ఈ రాశివారికి ఐదో స్థానంలో రెండు శుభ గ్రహాలు కలవనున్నాయి. దీంతో అనుకోని ఆర్థిక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. పెట్టుబడులు, ఇతర ఆర్థిక ప్రయత్నాలు సానుకూల ఫలితాలనివ్వవచ్చు. వివాహ ప్రయత్నాలు ఫలించి సంపన్న కుటుంబం నుంచి సంబంధం కుదరవచ్చు. కొత్త ఇల్లు, వాహనం కొనుగోలు చేసే ఆలోచనలు కార్యరూపం దాల్చవచ్చు. జీవనశైలిలో మార్పులు చోటుచేసుకుంటాయి.

కన్య రాశి వారికి ఆదాయ మార్గాలు పెరుగుతాయి

కన్య రాశివారికి రెండో స్థానంలో బుధ, శుక్రుల కలయిక ఏర్పడుతుంది. దీంతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడే సూచనలు ఉన్నాయి. ఉద్యోగులకు జీతభత్యాలు పెరగవచ్చు. ఆస్తి వివాదాలు పరిష్కారమై ప్రయోజనం కలగవచ్చు. వ్యాపారులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. గతంలో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం లభించడంతో పాటు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడవచ్చు.

తుల రాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్ అవకాశాలు

తుల రాశిలోనే బుధ, శుక్రులు సంచరించనుండటంతో ఈ రాశివారికి అనుకూల ఫలితాలు కలగవచ్చు. ఉద్యోగులకు పదోన్నతి, కొత్త బాధ్యతలు దక్కే అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి సంస్థల్లో ఉద్యోగాలు లభించవచ్చు. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే సూచనలు ఉన్నాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడి ఆర్థికంగా ప్రయోజనం కలగవచ్చు. వ్యాపారాల్లోనూ పురోగతి కనిపించవచ్చు.

ధనుస్సు రాశి వారికి వ్యాపారంలో భారీ లాభాలు

ధనుస్సు రాశివారికి పదకొండో స్థానంలో ఈ గ్రహాల కలయిక జరగనుంది. దీంతో ఆదాయం పెరిగేందుకు కొత్త మార్గాలు ఏర్పడవచ్చు. వ్యాపారులకు లాభాలు పెరిగే అవకాశముంది. ఉద్యోగులు తమ లక్ష్యాలను చేరుకోవచ్చు. పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నవారికి మంచి సంబంధాలు కుదరవచ్చు. ప్రేమ వ్యవహారాలు వివాహ బంధంగా మారే సూచనలు ఉన్నాయి. చాలాకాలంగా ఎదురుచూస్తున్న పనులు పూర్తయ్యే అవకాశం ఉంది.

కుంభ రాశి వారికి అదృష్టం కలిసొస్తుంది

కుంభ రాశివారికి తొమ్మిదో స్థానంలో బుధ, శుక్రుల కలయిక ఏర్పడుతుంది. దీంతో చేపట్టిన పనుల్లో విజయావకాశాలు పెరుగుతాయి. వారసత్వ ఆస్తుల ద్వారా ప్రయోజనం కలగవచ్చు. ఉద్యోగులకు జీతాలు పెరగడం, నిరుద్యోగులకు మంచి ఉద్యోగాలు లభించడం వంటి పరిణామాలు చోటుచేసుకోవచ్చు. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది.

గమనిక: ఇవి జ్యోతిష్య శాస్త్రం ఆధారంగా చెప్పిన సాధారణ అంచనాలు మాత్రమే. వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఫలితాలు మారవచ్చు. అలాగే వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.

Tags: