Daily Astrology: రాశిఫలాలుః అదృష్టం అంటే ఈ ఆరు రాశులవారిదే...
జూన్ 17, బుధవారం రోజున ఈ ఆరు రాశులవారికి అదృష్ట ద్వారాలు తెరుచుకోబోతున్నాయి. ఈరోజు ఈ రాశుల వారి జీవితాల్లో ఊహించని మార్పులు ఉంటాయి.
Daily Astrology: జూన్ 17, బుధవారం నిజ జ్యేష్ట మాస శుక్ల పక్ష తదియ తిథి సందర్భంగా ఏర్పడిన గ్రహగతులు కొన్ని రాశుల వారికి శుభఫలితాలు అందించగా, మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు ఈరోజు రాత్రికి చవితి తిథి ప్రారంభంతో పాటు మధ్యాహ్నం వరకు పునర్వసు నక్షత్రం, ఆ తరువాత పుష్యమి, అదేవిధంగా ధృవయోగంతో పాటు వ్యాఘాత యోగం కూడా ఉండటంతో వీటి ప్రభావం రాశులపై స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఈరోజు ఏ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం.
మేషరాశి
ఈరోజు ఈరాశివారికి సాధారణంగా ఉటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ అవసరం. మాటలతో మిమ్మల్ని ఇబ్బందులు పెట్టేవారున్నారు. జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోరాదు. ఆరోగ్యపరంగా ఇబ్బందులు రావొచ్చు. జ్ఞాన సరస్వతిని ఆరాధించడం ద్వారా మానసికంగా ప్రశాంతత లభిస్తుంది.
వృషభ రాశి
ఈరోజు ఈరాశివారు పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఓర్పుతో వ్యవహరించి కీలక సమస్యలకు పరిష్కారాలు కనుగొంటారు. ఖర్చులను నియంత్రించుకోవాలి. ఈరోజు ఈరాశివారు సంకష్టహర గణపతిని ఆరాధించడం వలన సానుకూల శక్తి పెరుగుతుంది.
మిథున రాశి
ఈరోజు ఈరాశివారికి పనిభారం పెరుగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం కొంతమేర తగ్గే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవాలి. ఈరోజు ఈరాశివారు నవగ్రహారాధన చేయడం వలన చీకాకుల నుంచి బయటపడతారు.
కర్కాటక రాశి
ఈరోజు ఈరాశివారికి శుభకరమైన ఫలితాలు ఉన్నాయి. ప్రణాళికతో ముందుకు సాగుతారు. ఆర్థికంగా బాగుంటుంది. కుటుంబ సభ్యుల సలహాలు, సూచనలు పాటిస్తారు. ఆరోగ్యం అనుకూలిస్తుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఈరోజు ఈరాశివారు ఆదిత్య హృదయం పఠించాలి.
సింహ రాశి
ఈరోజు ఈరాశివారికి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగంలో అనుకోని విధంగా మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారంలో ఊహించని లాభాలు ఉంటాయి. బాల్య స్నేహితులు, బంధువులతో ఆనందంగా గడుపుతారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక యాత్రలు చేసేందుకు ఆసక్తి చూపుతారు.
కన్య రాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు శుభకరంగా ఉన్నాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆదాయం రెట్టింపు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కీలక నిర్ణయాల్లో విజయాలు సాధిస్తారు. బంధాలు బలపడతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఈరోజు కులదైవాన్ని ఆరాధించడం శుభకరం.
తుల రాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు వ్యతిరేకంగా కనిపిస్తున్నాయి. పోటీ పెరుగుతుంది. ఖర్చులూ పెరుగుతాయి. ప్రయాణాలు చేయడం వలన అలసట చెందుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సిన సమయం. స్నేహితుల సలహాలు పాటించాలి. ఈరోజు ఈరాశివారు ఇష్టదైవాన్ని ఆరాధించాలి.
వృశ్చిక రాశి
ఈరోజు ఈరాశివారికి శుభకరమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగం, వ్యాపారంలో తిరుగులేని విజయం సాధిస్తారు. అధికారుల మెప్పును పొందుతారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. ఈరోజు ఈరాశివారు మహాశివుడిని ఆరాధించాలి.
ధనుస్సు రాశి
ధనుస్సురాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. బుద్ధిబలం, మాటతీరు ద్వారా అందరినీ ఆకట్టుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. హనుమంతుని ఆరాధన కార్యసిద్ధిని కలిగిస్తుంది.
మకర రాశి
మకరరాశి వారికి ఈ రోజు సహనం అవసరం. పనిభారం పెరుగుతుంది. బంధువులతో ఉన్న విభేదాలను ముగించడం మంచిది. అవసరం లేని ఖర్చులను తగ్గించుకోవాలి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరాదు. దుర్గాదేవి ధ్యానం రక్షణ కలిగిస్తుంది.
కుంభ రాశి
కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్రణాళిక లోపం వల్ల కొన్ని పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. అనుభవజ్ఞుల సలహాలు పాటిస్తే నష్టాలను నివారించవచ్చు. కుటుంబ సభ్యుల సహకారం మీకు బలంగా నిలుస్తుంది. వేంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదం.
మీన రాశి
మీనరాశి వారికి అదృష్టం కలిసివచ్చే రోజు. ఉద్యోగం, వ్యాపారాల్లో కొత్త అవకాశాలు లభిస్తాయి. భూమి, గృహం, వాహనాలకు సంబంధించిన శుభయోగాలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో శుభకార్యాల సూచనలు ఉన్నాయి. మనోధైర్యంతో ముందుకు సాగితే విజయం మీ సొంతమవుతుంది. ఇష్టదైవ దర్శనం మరిన్ని శుభఫలితాలను అందిస్తుంది.
గమనికః ఇక్కడ ఇచ్చినవి సామాన్యమైన ఫలితాలు మాత్రమే. పూర్తిస్థాయి వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి ఫలితాలు పొందాలంటే నిపుణులైన జ్యోతిష్యపండితులను సంప్రదించాలి.