జులై 15 రాశిఫలాలు - అదృష్టయోగం పట్టే రాశులు ఇవే
ఆషాఢమాసం శుక్లపక్షం పాడ్యమి తిథి రోజున ద్వాదశ రాశుల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో తెలుసుకుందాం.
Astrology: ఈరోజు ఆషాఢమాసం శుక్లపక్షం పాడ్యమి తిథి. ఈరోజు నుంచే ఆషాఢమాసం ప్రారంభం అవుతుంది. హర్షణ యోగం, వజ్రయోగం కలిసి రావడంతో కొన్ని రాశులకు అదృష్టయోగం పట్టబోతున్నది. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందామా.
మేషరాశి
ఈరోజు ఈరాశివారి ఆదాయం స్థిరంగా ఉంటుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కుటుంబంలో సఖ్యత నెలకొంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. వ్యాపారంలో లాభసూచన. కేసులు పరిష్కారమౌతాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది.
వృషభరాశి
ఈరోజు ఈరాశివారు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. గతంలో నిలిచిపోయిన పనులు వేగంగా పూర్తిచేస్తారు. న్యాయపరమైన చిక్కుల నుంచి బయటపడతారు. పలు కీలక ఒప్పందాలు చేసుకుంటారు. కుటుంబంలో సుఖసంతోషాలు ఉంటాయి. దూరప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
మిథునరాశి
ఈరోజు ఈరాశివారికి చేపట్టిన పనులు కొంతవరకు పూర్తవుతాయి. పెట్టుబడులకు తగిన ఫలితం లభిస్తుంది. గుర్తింపు పొందుతారు. ఆస్తి తగాదాలు పరిష్కారమౌతాయి. నూతన ఉద్యోగావకాశాలు ఉన్నాయి. ఖర్చులను నియంత్రించుకోవాలి.
కర్కాటకరాశి
ఈరోజు ఈరాశివారు సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. పలు అవకాశాలు మీ ముందుకు వస్తాయి. అయితే, శారీరక శ్రమ పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. కోర్టు సమస్యలు పరిష్కారమౌతాయి. నిర్ణయాలు తీసుకునే సమయంలో పెద్దల సలహాలు తీసుకోవాలి.
సింహరాశి
ఈరోజు ఈరాశివారి ఆదాయం పెరుగుతుంది. చేపట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాలు కలిసివస్తాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వివాదాల్లో చిక్కుకునే అవకాశం ఉంది. ఉద్యోగులకు కలిసి వస్తుంది.
కన్యారాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. కుటుంబంతో సంతోషంగా గడిపేందుకు ప్రయత్నిస్తారు. గతంలో ఆగిపోయిన పనులను తిరిగి ప్రారంభిస్తారు. ఉన్నత విద్యకోసం విద్యార్థులు చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. ఉద్యోగంలో మార్పులు ఉండొచ్చు. వివాదాలకు దూరంగా ఉండాలి.
తులారాశి
ఈరోజు ఈరాశివారు బాల్య స్నేహితులను కలుసుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. భూమికి సంబంధించిన లావాదేవీలు ముందుకు సాగుతాయి. నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
వృశ్చికరాశి
ఈరోజు ఈరాశివారు శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. తగాదాలు చాలా వరకు పరిష్కారమౌతాయి. నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. పనులపై శ్రద్ద నిలుపుతారు. నూతన ఉద్యోగావకాశాలు ఉన్నాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
ధనస్సురాశి
ఈరోజు ఈరాశివారు శుభకార్యాల్లో పాల్గొంటారు. పనులను సకాలంలో పూర్తిచేస్తారు. మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రులు సహకారం లభిస్తుంది. పలు అవకాశాలు మీ ముందుకు వస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.
మకరరాశి
ఈరోజు ఈరాశివారు చేపట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి. అవకాశాలను అనుకూలంగా మార్చుకుంటారు. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. విందువినోదాల్లో పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది.
కుంభరాశి
ఈరోజు ఈరాశివారికి ఆదాయం పరంగా ఇబ్బందులు తలెత్తవు. శుభకార్యాల్లో పాల్గొంటారు. బాల్య స్నేహితులను కలుసుకుంటారు. పని ఒత్తిడి పెరుగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు.
మీనరాశి
ఈరోజు ఈరాశివారు ఉత్సాహంతో పనులు మొదలుపెడతారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. చాలా కాలంగా పెండింగ్‌లోఉన్న సమస్యలు పరిష్కారమౌతాయి. దూర ప్రయాణాలు చేయాలి అనుకుంటే వాయిదా వేసుకోవాలి. వివాదాలకు వీలైనంత వరకు దూరంగా ఉండాలి. మాటపట్టింపులు రావొచ్చు.
గమనికః ఇక్కడ ఇచ్చినవి కేవలం సామాన్యమైన ఫలితాలు మాత్రమే. వ్యక్తిగత ఫలితాల కోసం నిపుణులైన జ్యోతిష్య పండితులను సంప్రదించండి.