Vastu Tips: ఇంట్లో మర్రి చెట్టు పెరగడం మంచిదేనా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది.!
Vastu Tips: హిందూ ధర్మంలో మర్రి చెట్టుకు అత్యంత పవిత్ర స్థానం ఉంది.
Vastu Tips: ఇంట్లో మర్రి చెట్టు పెరగడం మంచిదేనా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది.!
Vastu Tips: హిందూ ధర్మంలో మర్రి చెట్టుకు అత్యంత పవిత్ర స్థానం ఉంది. అయితే ఇంట్లోనే లేదా ఇంటి ఆవరణలో ఈ మొక్క మొలకెత్తితే మంచిదా లేక నష్టమా అనేదానిపై వాస్తు శాస్త్ర నిపుణులు పలు కీలక విషయాలు వెల్లడిస్తున్నారు.
మన దేశంలో చెట్లు, మొక్కలను పూజించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ముఖ్యంగా హిందూ ధర్మంలో కొన్ని ప్రత్యేకమైన వృక్షాలకు దైవిక శక్తి ఉందని, వాటిని పూజిస్తే శుభం కలుగుతుందని నమ్ముతారు. అలాంటి వాటిలో మర్రి చెట్టుకు అత్యంత ప్రాధాన్యత, పవిత్ర స్థానం ఉందని పండితులు చెబుతున్నారు. అయితే ఈ చెట్టును సాధారణంగా ఎల్లప్పుడూ దేవాలయాల వద్ద, పుణ్యక్షేత్రాలు లేదా బహిరంగ ప్రదేశాలలో మాత్రమే నాటుతుంటారు. కానీ ఎవరైనా ఇళ్లలో దీనిని పెంచవచ్చా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ఆవరణలో మర్రి మొక్క మొలకెత్తడం త్రిమూర్తుల అనుగ్రహానికి సూచికగా భావిస్తారని నిపుణులు పేర్కొంటున్నారు.
ఇంట్లో లేదా ఆ ఇంటి పరిసరాల్లో మర్రి మొక్క వాటంతట అదే పెరిగితే కుటుంబంలో సానుకూల మార్పులు వస్తాయని, ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని చాలామంది నమ్ముతుంటారు. అయితే ఆధ్యాత్మిక కోణంలో ఇది మంచిదే అయినప్పటికీ, ఆచరణాత్మకంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. మర్రి చెట్టు చాలా వేగంగా పెరుగుతుందనే విషయం తెలిసిందే. దీని వేర్లు చాలా బలంగా విస్తరించి ఇంటి గోడలకు, పునాదులకు తీవ్ర నష్టం కలిగించే అవకాశం ఉంది. దీనివల్ల భవిష్యత్తులో ఇంటి నిర్మాణానికి ప్రమాదం వాటిల్లే ముప్పు ఉంటుంది.
కాబట్టి గోడలకు దూరంగా, విశాల ప్రదేశంలో మాత్రమే ఈ మొక్కను నాటడం ఉత్తమం అని నిపుణులు సూచిస్తున్నారు. ఇళ్లలో చిన్న కుండీలలో లేదా గోడల పక్కన ఇష్టానుసారంగా పెరగనివ్వడం వల్ల ఇబ్బందులు ఎదురుకావచ్చు. ఒకవేళ ఇంటి గోడల మధ్యలో లేదా ప్రమాదకర ప్రాంతాలలో మర్రి మొక్క మొలకెత్తితే దానిని తొలగించి వేరే విశాలమైన బహిరంగ ప్రదేశంలో నాటడం మంచిది. ఆధ్యాత్మిక విశ్వాసాలను గౌరవిస్తూనే, ఇంటి భద్రతను దృష్టిలో ఉంచుకుని సరైన జాగ్రత్తలు పాటించడం ఎంతో అవసరమని వాస్తు శాస్త్రం స్పష్టం చేస్తోంది.