వాతావరణ శాఖ హెచ్చరిక.. 8 జిల్లాలకు రెడ్ అలెర్ట్.. రాత్రి పూట కూడా నిప్పుల కుంపటే!

Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు 8 జిల్లాలకు రెడ్ అలెర్ట్ 7 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ. రాత్రి పూట కూడా పెరగనున్న ఉష్ణోగ్రతలు.

Update: 2026-05-22 09:43 GMT

వాతావరణ శాఖ హెచ్చరిక.. 8 జిల్లాలకు రెడ్ అలెర్ట్.. రాత్రి పూట కూడా నిప్పుల కుంపటే!

Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత, వాతావరణ మార్పులు మునుపెన్నడూ లేని విధంగా ఆందోళన కలిగిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తీవ్రం కానున్నాయనే హెచ్చరికల నేపథ్యంలో వాతావరణ కేంద్రం అత్యంత కీలకమైన హెచ్చరికలను జారీ చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాలను వాతావరణ తీవ్రత ఆధారంగా వివిధ కేటగిరీలుగా విభజించి అలెర్ట్‌లు ప్రకటించింది.

బాపట్ల లో 46. 4 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు. దక్షిణ కోస్తా లో అన్ని ప్రాంతాల్లో 45 డిగ్రీల పైబడి నమోదు. రాయలసీమ ప్రాంతాల్లో 7 డిగ్రీల అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రాబోయే ఐదు రోజుల పాటు కోస్తా జిల్లాల్లో తీవ్రమైన హీట్ వేవ్ పరిస్థితులు కొనసాగనున్నాయని హెచ్చరించింది.

దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా లో తీవ్రమైన వడ గాలులు. ఏలూరు, కృష్ణ, బాపట్ల, పలనాడు, గుంటూరు, NTR జిల్లాలో రెడ్ అలర్ట్ అమలులో ఉండగా, గోదావరి జిల్లాలు, కోనసీమ, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఎల్లో అలర్ట్ కొనసాగుతోంది. అలాగే రాత్రిపూట కూడా ఉష్ణోగ్రతలు అధికంగానే ఉండే అవకాశం ఉండటంతో ‘వార్మ్ నైట్స్’ను కూడా ప్రకటించారు.

ఇక ఒడిశా తీర ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఆగ్నేయ బంగాళాఖాతంలో ద్రోణి కొనసాగుతోందని వెల్లడించింది.

Tags:    

Similar News