Ap Govt: గుడ్ న్యూస్..వారి అకౌంట్లలో రూ. 13,000 జమ

Ap Govt: కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మక 'తల్లికి వందనం' పథకం కింద ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో రూ.13,000 జమ చేయడానికి ముహూర్తం ఖరారు చేసింది.

Update: 2026-07-15 04:04 GMT

Ap Govt: గుడ్ న్యూస్..వారి అకౌంట్లలో రూ. 13,000 జమ

Thalliki Vandanam: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్థులకు, వారి తల్లులకు కూటమి ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించింది. ఎన్నికల హామీల్లో అత్యంత కీలకమైన ‘తల్లికి వందనం’ పథకం నిధుల విడుదలపై రాష్ట్ర సర్కార్ ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ పథకం కింద అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు విద్యాశాఖ శరవేగంగా కసరత్తులు చేస్తోంది.

ప్రాథమిక సమాచారం ప్రకారం.. ప్రభుత్వం జూలై 16, 17, 18 తేదీలలో ‘తల్లికి వందనం’ నిధులను విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. దీనికి సంబంధించి తొలి విడతగా ఏకంగా రూ. 10,049 కోట్ల నిధుల విడుదలకు ప్రభుత్వం నుంచి నేడే పరిపాలన అనుమతులు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారిక వర్గాల ద్వారా తెలుస్తోంది.

ఈ పథకానికి అర్హులైన ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో రూ. 13,000 చొప్పున నేరుగా జమ అవుతాయి. మిగిలిన రూ. 2,000 నిధులను విద్యార్థులు చదువుతున్న పాఠశాలల మౌలిక వసతులు, నిర్వహణ కోసం ప్రభుత్వం కేటాయించనుంది. ప్రస్తుతం బడులు తెరిచిన తర్వాత కొత్తగా పాఠశాలల్లో చేరిన విద్యార్థులకు సంబంధించిన వివరాలను సేకరించి, వారికి రెండో విడతలో నిధులను విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ పథకం అమలు ప్రక్రియను మరింత పారదర్శకంగా మార్చేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 24వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ నిర్వహించనున్నారు. ఈ భారీ మీటింగ్స్ జరిగే లోపే అర్హులైన తల్లులందరి ఖాతాల్లోకి ‘తల్లికి వందనం’ డబ్బులు చేరిపోయేలా సర్కార్ పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్తోంది. ఈ నిధుల విడుదలతో కొత్త విద్యా సంవత్సరంలో విద్యార్థుల పుస్తకాలు, యూనిఫారాలు, ఇతర అవసరాలకు తల్లులపై ఆర్థిక భారం తప్పనుంది.

Tags:    

Similar News