APSRTC: ఏపీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్.. మహిళల కోసం బస్సుల్లో సరికొత్తగా..

APSRTC: ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది.

Update: 2026-06-10 14:58 GMT

APSRTC Buses: ఏపీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్.. మహిళల కోసం బస్సుల్లో సరికొత్తగా..

APSRTC sanitary napkins: పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ప్రయాణించే మహిళల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో శానిటరీ నాప్‌కిన్లను అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. సాధారణంగా బస్సుల్లో సుదూర ప్రాంతాలకు ప్రయాణించేటప్పుడు మహిళలు కొన్నిసార్లు అనుకోని విధంగా నెలసరి సమస్యలను ఎదుర్కొంటారు.

ప్రయాణంలో ఉన్నప్పుడు చుట్టుపక్కల మెడికల్ షాపులు అందుబాటులో లేకపోవడం వల్ల ఇబ్బందికి, అసౌకర్యానికి గురవుతుంటారు. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో మహిళలు పడే మానసిక ఆందోళనను, శారీరక ఇబ్బందిని తొలగించడానికే ప్రభుత్వం ఈ "శానిటరీ ప్యాడ్స్" సదుపాయాన్ని బస్సుల్లో ప్రవేశపెడుతోంది.

బస్సుల్లో ప్రయాణికుల కోసం ఇప్పటికే ఉండే ఫస్ట్ ఎయిడ్ బాక్సుల్లో ఇకపై తప్పనిసరిగా శానిటరీ నాప్‌కిన్లను కూడా ఉంచాలని రవాణా శాఖ నిర్ణయించింది. ఈ సదుపాయాన్ని ప్రాథమికంగా సుదూర ప్రాంతాలకు వెళ్లే సూపర్ లగ్జరీ, ఇంద్ర, అమరావతి, గరుడ వంటి బస్సుల్లో ప్రారంభించి, ఆ తర్వాత దశలవారీగా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులకు కూడా విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోంది.



Tags:    

Similar News