AP JAC: కూటమి సర్కార్‌కు బిగ్ షాక్.. సమ్మె దిశగా ఏపీ ఉద్యోగ సంఘాలు!

AP JAC: ఏపీ జేఏసీ పీఆర్‌సీ, డీఏ బకాయిల పరిష్కారమే లక్ష్యంగా సెప్టెంబర్ 5న విజయవాడలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించనుంది.

Update: 2026-08-30 03:32 GMT

AP JAC: కూటమి సర్కార్‌కు బిగ్ షాక్.. సమ్మె దిశగా ఏపీ ఉద్యోగ సంఘాలు!

AP JAC: ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ తమ భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేసుకునేందుకు సమరశంఖం పూరించింది. ఉద్యోగులు, పెన్షనర్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించేలా, పెండింగ్ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సెప్టెంబర్ 5న విజయవాడలో రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించబోతున్నట్లు ప్రకటించింది.

ప్రధాన డిమాండ్లను ఓసారి పరిశీలిస్తే.. నూతన వేతన సవరణపై ప్రభుత్వం నుంచి తగిన స్పందన కోరడం. గత కొంతకాలంగా నిలిచిపోయిన కరువు భత్యం బకాయిలను తక్షణమే చెల్లించడం. ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించాల్సిన ఇతర ఆర్థిక ప్రయోజనాల జాప్యంపై చర్చించడం.

తమ మొదటి ప్రాధాన్యం ఎప్పుడూ చర్చలు, సంప్రదింపులకే. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోతేనే ఉద్యమ బాట పడతాం" అని ఏపీ జేఏసీ చైర్మన్ విద్యాసాగర్, సెక్రటరీ జనరల్ కేఎస్ఎస్ ప్రసాద్ స్పష్టం చేశారు. మంత్రుల బృందం ఇచ్చిన హామీ మేరకు త్వరలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశం జరుగుతుందనే ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు.

ప్రభుత్వం ఇప్పటివరకు రూ.22 వేల కోట్ల బకాయిలను చెల్లించడాన్ని, ప్రతి నెలా 1వ తేదీనే జీతాలు ఇస్తుండటాన్ని జేఏసీ అభినందించింది. అలాగే 11 వేల మందికి ఓపీఎస్ వర్తింపజేయడం, 8 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించడం వంటి నిర్ణయాలను గుర్తుచేసింది.

ప్రభుత్వ చర్యలు కొన్ని రకాలుగా ఊరటనిచ్చినప్పటికీ, కీలకమైన పీఆర్‌సీ, డీఏల చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో ఉద్యోగ, పెన్షనర్ల వర్గాల్లో అసంతృప్తి నెలకొంది. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ 5న జరగబోయే విజయవాడ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వం నుంచి ఆశించిన స్పందన రాకపోతే, ఈ సమావేశంలోనే భవిష్యత్ ఉద్యమ రూప్‌రేఖలను ఖరారు చేయనున్నారు.

Tags:    

Similar News