Anantapur: ఆటో డ్రైవర్ మర్మాంగం కోసేసిన మహిళ!

Anantapur: అనంతపురం డ్రైవర్స్ కాలనీలో దారుణ ఘటన జరిగింది. కూతురిని లొంగదీసుకోవాలని చూశాడనే కోపంతో సునీత అనే మహిళ ఆటో డ్రైవర్ సురేష్ మర్మాంగాన్ని కోసేసింది.

Update: 2026-08-01 06:21 GMT

Anantapur: ఆటో డ్రైవర్ మర్మాంగం కోసేసిన మహిళ!

Anantapur: అనంతపురంలో శుక్రవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానిక డ్రైవర్స్ కాలనీలో ఓ మహిళ ఆటో డ్రైవర్ మర్మాంగాన్ని కోసేసిన సంఘటన తీవ్ర కలకలం రేపింది.

బాధితుడిని రాచానపల్లి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ సురేష్‌గా పోలీసులు గుర్తించారు.

ఘటన వివరాల్లోకి వెళ్తే...

తల్లితో పాటు ఆమె కూతురిని కూడా లొంగదీసుకోవాలనే నీచమైన ఆలోచన సురేష్‌కు వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలోనే సదరు మహిళ సునీత తీవ్ర ఆగ్రహానికి గురై, సురేష్ మర్మాంగాన్ని కోసి వేసినట్లు తెలుస్తోంది.

తీవ్ర రక్తస్రావంతో గాయపడిన సురేష్‌ను స్థానికులు తక్షణమే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

సమాచారం అందుకున్న వన్‌టౌన్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని, ఈ ఘటన వెనుక ఉన్న పూర్తి వివరాలపై దర్యాప్తు జరుపుతున్నారు.

Tags:    

Similar News