Raptadu: తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి దివంగత నేత చమన్ భార్య వార్నింగ్!

Raptadu: రాజకీయాల్లో మాటల యుద్ధం ముదిరింది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై దివంగత నేత చమన్ సాబ్ భార్య తీవ్రస్థాయిలో ఆగ్రహం

Update: 2026-07-06 14:49 GMT

Raptadu: తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి దివంగత నేత చమన్ భార్య వార్నింగ్!

రాప్తాడు: నియోజకవర్గ రాజకీయాల్లో మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ జెడ్పీ చైర్మన్, దివంగత నేత చమన్ సాబ్ భార్య తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

రాజకీయ లబ్ధి కోసమే చమన్ సాబ్ పేరును పదేపదే వాడుకుంటున్నారంటూ ఆమె తోపుదుర్తిపై మండిపడ్డారు.రాజకీయ లబ్ధి కోసమే విమర్శలు చమన్ సాబ్ మరణించి ఎన్నో సంవత్సరాలు గడిచింది. కానీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాత్రం కేవలం తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే ఆయన పేరును పదేపదే ప్రస్తావిస్తున్నారు.

పరిటాల కుటుంబానికి, మా కుటుంబానికి అప్పటిలాగే.. ఇప్పటికీ అదే అనుబంధం కొనసాగుతోంది. మా కుటుంబాల మధ్య ఉన్న వ్యక్తిగత, రాజకీయ సంబంధాలపై ఇతరులు మాట్లాడటం సరైన పద్ధతి కాదు.రాజకీయాలను రాజకీయాలుగానే చూసుకోవాలి. అంతే తప్ప మరణించిన చమన్ సాబ్ పేరును రాజకీయాల్లోకి లాగితే మాత్రం మేము చూస్తూ ఊరుకోం. ఇకనైనా చమన్ సాబ్ ప్రస్తావన.

Tags:    

Similar News