Dharmavaram: ధర్మవరంలో వైఎస్సార్‌సీపీ ‘AP GEN Z WAR’ రిలే దీక్షలు!
Dharmavaram: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో వైఎస్సార్‌సీపీ ‘AP GEN Z WAR’ రిలే దీక్షలు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో ఈ నిరసన జరిగింది.
Dharmavaram: ధర్మవరంలో వైఎస్సార్‌సీపీ ‘AP GEN Z WAR’ రిలే దీక్షలు!
శ్రీ సత్యసాయి జిల్లా:
మెగా డీఎస్సీ 2025 నియామకాల్లో జరిగిన అవకతవకల పై వెంటనే సిబిఐ విచారణ జరిపించాలని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి డిమాండ్ చేశారు.
డీఎస్సీ నియామకాల్లో అక్రమాలకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యా శాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని కేతిరెడ్డి డిమాండ్ చేశారు.
డీఎస్సీ అక్రమాలపై సిబిఐ విచారణ,
మంత్రి నారా లోకేష్ రాజీనామా,
ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు 9500 కోట్లు వెంటనే విడుదల చేయాలని
నిరుద్యోగ భృతి 3000 ఇవ్వాలనే డిమాండ్లతో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ విద్యార్థి యువజన విభాగం నాయకులు AP GEN Z WAR పేరుతో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.ఇందులో భాగంగా ధర్మవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద వైకాపా విద్యార్థి యువజన విభాగం నాయకులు చేపట్టిన రిలే దీక్షలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పాల్గొని మెగా డీఎస్సీ నియామకల్లో స్పోర్ట్స్ కోటాలో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశాడు.
నారా లోకేష్ విద్యా శాఖను అసమర్థంగా నిర్వహించడం వల్లనే ఇలాంటి అవకతవకలు జరుగుతున్నాయని కేతిరెడ్డి అన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెలకు రెండు మూడు ఈవెంట్లు చేస్తూ అంతా బాగుందంటూ ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు.
రాష్ట్రంలో విద్యార్థులు యువత అసంతృప్తిగా ఉన్నారని నారా లోకేష్ రాజీనామా చేయకపోతే ఢిల్లీలో ఏ విధంగా ఉద్యమం జరిగిందో చూశారు కదా అంటూ కాక్రోచ్ ఉద్యమాన్ని ఊటంకించి కేతిరెడ్డి హెచ్చరించారు.