Anantapur: రుద్రంపేటలో 32 ఏళ్ల తర్వాత టీడీపీ చారిత్రాత్మక విజయం!

అనంతపురం: అనంతపురం రూరల్ మండలం రుద్రంపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఉప్పర హరి ప్రసాద్ ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థిపై 1,116 ఓట్ల భారీ మెజార్టీతో విజయకేతనం ఎగురవేశారు. తన గెలుపుకు కారనమైన మా కాలనీ వాసులకు నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.

అదేవిదంగా ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అయితే రుద్రంపేటలో టీడీపీ సాధించిన ఈ విజయం ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది. 1994లో టీడీపీ తరఫున పోటీ చేసిన పూజారి నాగన్న సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. మళ్లీ 32 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఇప్పుడు టీడీపీ అభ్యర్థి ఉప్పర హరి ప్రసాద్ సర్పంచ్‌గా విజయం సాధించడం విశేషం.

దీంతో మూడు దశాబ్దాలకు పైగా తర్వాత రుద్రంపేట పంచాయతీలో టీడీపీ అభ్యర్థి సర్పంచ్‌గా ఎన్నిక కావడంతో పార్టీ శ్రేణులు, మద్దతుదారుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. విజయం అనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎన్. నారాయణస్వామి చేతుల మీదుగా ఉప్పర హరి ప్రసాద్ గెలుపు ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు.

Tags: